Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs LSG: మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఊచకోత

GT vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదా‌బాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరును సాధించింది. లక్నో బ్యాటర్లు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ చెలరేగడంతో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేయగలిగింది. మిచెల్ మార్ష్ అద్బుతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. 56 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సులతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. నికోలస్ పూరన్ తన మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. పూరన్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్ష్, పూరన్ రెండో వికెట్ కు 121 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అద్భుతమైన సెంచరీ సాధించాడు. మార్ష్ ప్రారంభం నుంచే దూకుడుగా కనిపించాడు. టేబుల్-టాపర్ బౌలర్లను కూడా ఊచకోత కోశాడు. గుజరాత్ బౌలర్లందరూ మార్ష్ ముందు నిస్సహాయంగా కనిపించారు. మిచెల్ మార్ష్ రషీద్ ఖాన్ వేసిన ఒక ఓవర్లోనే 25 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మార్ష్‌కి ఇది తొలి సెంచరీ.

GT vs LSG Mitchell Marsh and Nicholas Pooran s Explosive Partnership

మార్ష్ విధ్వంసం
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్‌లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. మార్ష్, మార్‌క్రమ్‌ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. మార్ష్ మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు. ఈ సమయంలో మిచెల్ మార్ష్ 32 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన అర్థ సెంచరీ తర్వాత మార్ష్ తన సెంచరీని చేరుకోవడానికి కేవలం 24 బంతులను ఎదుర్కొన్నాడు. అర్షద్ ఖాన్ వేసిన 16.5 ఓవర్ కు ఫోర్ బాదిన తర్వాత బంతికి సింగిల్ తీసి మూడంకెల స్కోరును అందుకున్నాడు. 56 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. మార్ష్ తన సెంచరీని చేరుకోవడానికి 10 ఫోర్లు, 6 అద్భుతమైన సిక్సర్లతో కొట్టాడు.

రషీద్ వేసిన ఓవర్లో 25 పరుగులు
మరోవైపు ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన బౌలర్లలో ఒకరై రషీద్ ఖాన్ ఈ సీజన్ లో తేలిపోతున్నాడు. ఇవాళ లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్ ను ఊచకోత కోశాడు. ఒకే ఓవర్లో 25 పరుగులు చేశాడు. గుజరాత్ తరఫున ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్‌పై మిచెల్ వరుసగా ఐదు బంతుల్లో బౌండరీలు బాదాడు. మార్ష్ తన ఓవర్లో మొత్తం 25 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు, ఒక సింగిల్ ఉన్నాయి. ఒకే ఓవర్లో వరుసగా 6,4,6,4,4,1 బాదాడు. రషీద్ ఖాన్ పై ఇంతకు ముందు ఏ బ్యాట్స్ మాన్ కూడా ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడలేదు.

Story first published: Thursday, May 22, 2025, 22:03 [IST]
Other articles published on May 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+