LSG vs GT: రషీద్ మాయాజాలం.. లక్నోపై ఘన విజయంతో ప్లేఆఫ్ చేరిన తొలిజట్టుగా గుజరాత్

గింగిరాలు తిప్పే బౌలింగ్‌తో రషీద్ ఖాన్ చేసిన మాయాజాలానికి లక్నో బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. రషీద్‌కు తోడు షమీ, యష్ దయాల్, కొత్త కుర్రాడు సాయి కిషోర్ భీకర బౌలింగ్ దాటికి లక్నో బ్యాటర్లు ఏమాత్రం క్రీజులో నిలబడలేకపోయారు. ఫలితంగా లక్నో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు అద్భుత విజయంతో ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డులకెక్కింది. కొత్త జట్టు అయినా గుజరాత్ టైటాన్స్ సమిష్టిగా రాణించి ఈ సీజన్లో అత్యుత్తమ జట్టుగా కొనసాగుతుంది. హార్దిక్ సేన జట్టులో మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉండడం ఆ జట్టుకు కలిసొస్తుంది.

సింగిల్ డిజిట్‌కే పరిమితమైన లక్నో బ్యాటర్లు
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 20ఓవర్లు ముగిసేసరికి జీటీ 4వికెట్లు కోల్పోయి 144పరుగులు చేయగా.. 145పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లక్నో 13.5ఓవర్లకు 82పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 62పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచి సగర్వంగా ప్లేఆఫ్ రేసుకు చేరింది. ఇక లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా (27పరుగులు 26బంతుల్లో) మినహా మిగతా బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. డికాక్ (11), ఆవేశ్ ఖాన్ (12) తప్పా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

చెలరేగిన గుజరాత్ బౌలర్లు
ఇక గుజరాత్ బౌలింగ్లో మహ్మద్ షమీ 3ఓవర్లు వేసి కేవలం 5పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. యష్ దయాళ్ 2వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 3.5ఓవర్లలో 4వికెట్లు తీసి 24పరుగులు ఇచ్చాడు. తన గింగిరాలు తిప్పే బౌలింగ్‌తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించి రషీద్.. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లను నిలబడనీవ్వకుండా బంతులు వేశాడు. మరో వైపు డెబ్యూ బౌలర్ సాయి కిషోర్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 2ఓవర్లు వేసి 2వికెట్లు తీసి 7పరుగులు మాత్రమే ఇచ్చాడు.

పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అవార్డులు
పంచ్ సూపర్ స్ట్రైకర్ - రాహుల్ తెవాతీయా
గేమ్ ఛేంజర్ - రషీద్ ఖాన్
క్రాకింగ్ సిక్సెస్ - ఆవేష్ ఖాన్
పవర్ ప్లేయర్ - మహ్మద్ షమీ
వాల్యుబుల్ అసెట్ - శుభ్ మాన్ గిల్
ఫాస్టెస్ట్ డెలివరీ - దుష్మంత్ చమీరా
ఆన్ ది గో ఫోర్స్ - శుభ్ మాన్ గిల్
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ - శుభ్ మాన్ గిల్

తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన శుభ్‌మాన్
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (63పరుగులు 49బంతుల్లో 7ఫోర్లు నాటౌట్) కడదాకా నిలబడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రాహుల్ తెవాతీయ (23పరుగులు 16బంతుల్లో 4ఫోర్లు నాటౌట్) రాణించడంతో గుజరాత్ 144పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ ఒక వికెట్, ఆవేశ్ ఖాన్ 2వికెట్లు తీశాడు. జాసన్ హోల్డర్ 1వికెట్ తీశారు.

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications