Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs LSG: రెండు సార్లు తప్పిన ప్రమాదం!

GT vs LSG: గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రెండుసార్లు పెద్ద ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్డేడియంలో బౌలింగ్ చేస్తున్నప్పుడు గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ కాలు బాగా తడబడింది. బంతి వేయడానికి ముందు అర్షద్ ఖాన్ కాలు జారి దబ్బున నేలపై పడిపోయాడు. అర్షద్ ఖాన్ కొంతసేపు నేలపై కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అర్షద్ ఖాన్ గాయపడినట్లు అనిపించింది. కానీ అర్షద్ ఖాన్ మళ్లీ బౌలింగ్ చేశాడు. మరోసారి అదే విధంగా రెండో సారి జారిపడ్డాడు. అదృష్టవశాత్తూ గుజరాత్ ఫాస్ట్ బౌల‌ర్‌కు పెద్ద గాయం కాలేదు.

తృటిలో తప్పించుకున్న అర్షద్ ఖాన్
గుజరాత్ టైటాన్స్, లక్నోసూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అర్షద్ ఖాన్ రెండుసార్లు తృటిలో తప్పించుకున్నాడు. నిజానికి ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ వేయడానికి వచ్చిన అర్షద్ ఖాన్ తన స్పెల్‌లోని మొదటి బంతిని వేయబోతుండగా.. కాలు జారి అర్షద్ దబ్బుమని నేలపై పడిపోయాడు. ఈ క్రమంలో అర్షద్ ఖాన్ కొంతసేపు లేవలేకపోయాడు. అర్షద్‌‌ను చూస్తుంటే అతని భుజానికి తీవ్ర గాయం అయినట్లు కనిపించింది.

GT vs LSG A Close Call - Arshad Khan Escapes Injury Twice in a Single Match

అయితే ఫిజియో చెకప్ తర్వాత అర్షద్ మళ్లీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. అనంతరం మరో నాలుగు బంతులు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత మరోసారి అతని కాలుజారి కిందపడి పోయాడు. ఏదో విధంగా అర్షద్ ఖాన్ తన ఓవర్ పూర్తి చేసి వెంటనే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అర్షద్ ఖాన్ ఎంత తీవ్రంగా గాయపడ్డాడో తెలియదు. అయితే అర్షద్ ఖాన్ స్వయంగా మైదానం నుంచి బయటకు నడిచి వెళ్లిపోయాడు.

Story first published: Thursday, May 22, 2025, 21:01 [IST]
Other articles published on May 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+