Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొంపముంచిన అజింక్యా రహానే.. వరుసగా ఆరో ఓటమి!

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టు కేకేఆర్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కేకేఆర్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ 79 పరుగులతో రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 86 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. మరోవైపు ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయలేక పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

రబాడ దెబ్బకు కేకేఆర్ విలవిల:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే చుక్కెదురైంది. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే కెప్టెన్ రహానే (0) అవుట్ అయ్యాడు. రఘువంశీ (8), టీమ్ సీఫెర్ట్ (19) కూడా త్వరగానే వెనుదిరిగారు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో కామెరూన్ గ్రీన్ (79) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. రబడ తన 4 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీయగా, సిరాజ్, అశోక్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో కేకేఆర్ 180 పరుగులకు పరిమితమైంది.

GT vs KKR IPL 2026 Shubman Gill Heroic 86 Leads Gujarat Titans to a Thumping Victory Against KKR

గిల్ విధ్వంసం .. ఆరెంజ్ క్యాప్ కైవసం
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ (22) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్ 71 పరుగులు సాధించి విజయానికి బలమైన పునాది వేసింది. జోస్ బట్లర్ (25) కూడా ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ తన అర్ధసెంచరీని పూర్తి చేయడమే కాకుండా, విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా 'ఆరెంజ్ క్యాప్'ను సొంతం చేసుకున్నాడు.

చివరలో ఉత్కంఠ
సెంచరీ దిశగా సాగుతున్న శుభ్‌మన్ గిల్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. గిల్ ఔట్ అయిన తర్వాత గుజరాత్ బ్యాటర్లు పరుగులు తీయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లగా, ఐదో బంతికి గుజరాత్ విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో కగిసో రబాడ, బ్యాటింగ్‌లో గిల్ సమిష్టిగా రాణించడంతో అహ్మదాబాద్ కోటలో గుజరాత్ జైత్రయాత్ర కొనసాగింది. కోల్‌కతాకు ఈ సీజన్ ఇప్పటికీ నిరాశనే మిగిల్చింది.

Story first published: Friday, April 17, 2026, 23:37 [IST]
Other articles published on Apr 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+