ఆ తప్పులు మళ్లీ చేయం: శుభ్‌మన్ గిల్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి తమ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడి భారీ స్కోరు సాధించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజింక్యా రహానే వెల్లడించాడు. అలాగే జట్టులో ఒక మార్పు చేస్తూ ఫిన్ అలెన్ స్థానంలో టీమ్ సీఫెర్ట్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు
మరోవైపు టాస్ ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని భావించినట్లు పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురిసే అవకాశం ఉన్నందున ఛేజింగ్ సులభం కావచ్చని గిల్ అభిప్రాయపడ్డాడు. గత మ్యాచ్‌లో తమ మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల సులభమైన ఛేజింగ్‌ను కూడా కష్టతరం చేసుకున్నామని.. ఈసారి చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నామని గిల్ వెల్లడించాడు. గుజరాత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా అదే తుది జట్టుతో ఆడుతోంది.

తుది జట్లు ఇవే..
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
టీమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కాగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications