Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs KKR: రహానే డకౌట్.. రింకూ ప్లాప్: ఆదుకున్న రూ.25 కోట్ల ఆటగాడు!

GT vs KKR: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న పోరులో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసి.. గుజరాత్ ముందు 181 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టును ఆదుకున్నాడు.

ఆరంభంలోనే ఎదురుదెబ్బ:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కెప్టెన్ అజింక్యా రహానే (0)ను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అంగ్క్రిష్ రఘువంశీ (8), టీమ్ సీఫెర్ట్ (19) వికెట్లను కాగిసో రబాడ పడగొట్టాడు. దీంతో కేవలం 32 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది.

GT vs KKR Cameron Green Heroic 79 Saves KKR Gujarat Titans Set a Target of 181 Runs Full Details

కామెరూన్ గ్రీన్ ఒంటరి పోరాటం:
ఈ దశలో రోవ్‌మన్ పావెల్ ( 20 బంతుల్లో 27)తో కలిసి కామెరూన్ గ్రీన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పావెల్ ఔట్ అయిన తర్వాత గ్రీన్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్.. మొత్తం 79 పరుగులతో కేకేఆర్ స్కోరును 180కి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అనుకుల్ రాయ్ (9) తో కలిసి ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు.

విఫలమైన మిడిల్ ఆర్డర్:
మరోవైపు కేకేఆర్ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ (1) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. రమణ్‌దీప్ సింగ్ (17), సునీల్ నరైన్ (0), కార్తీక్ త్యాగి (6) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో కాగిసో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు పడగొట్టగా, సిరాజ్, అశోక్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్‌కు ఇది సవాలుతో కూడుకున్నదే. హెడ్-టు-హెడ్ రికార్డుల ప్రకారం గుజరాత్ 3-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతాకు ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కీలకం. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ బ్యాటింగ్ లైనప్ ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.

Story first published: Friday, April 17, 2026, 21:42 [IST]
Other articles published on Apr 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+