Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛాంపియన్‌లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్

ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో.. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం నుంచి ఆరో ర్యాంక్‌కు ఎగబాకింది.

మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. ఛాంపియన్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగుతున్నామని, అదే తమ వరుస విజయాల రహస్యమని చెప్పాడు. తమ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలో ఈ మ్యాచ్ ఒకటిగా నిలుస్తుందని అన్నాడు. ఇది ఆరంభం మాత్రమే అని, ఇంకా తమ ఆటను మెరుగుపర్చుకుంటామని పంత్ పేర్కొన్నాడు.

GT vs DC We talked about the champion thought process- Rishabh Pant

ఈ మ్యాచ్‌లో పంత్ రెండు మెరుపు స్టంపింగ్‌లతో పాటు రెండు అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అతని వికెట్ కీపింగ్ గురించి మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని పంత్ అన్నాడు. ''ఛాంపియన్ మైండ్‌సెట్‌తో వెళ్లాలనుకున్నాం. మైదానంలో మా జట్టు అదే తరహాలో బదులిచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది కచ్చితంగా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలో ఒకటి. టోర్నమెంట్ ఆరంభంలోనే ఉన్నాం. ఇంకా మా ప్రదర్శన మెరుగుపర్చుకుంటాం''

''మైదానంలో అడుగుపెట్టే ముందు మెరుగైన ప్రదర్శన చేయాలనే ఆలోచనతో వస్తాను. గాయం నుంచి కోలుకునే సమయంలో ఇదే ఆలోచించాను. ప్రతి మ్యాచ్‌లో నా ఆట పట్ల సంతోషంగా ఉన్నాను. ఇక 90 రన్స్ ఛేజింగ్ విషయానికొస్తే.. సాధ్యమైనంత త్వరగా విజయాన్ని అందుకోవాలనుకున్నాం. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఓటములతో నెట్ రన్ రేటును కోల్పోయాం. దాన్ని తిరిగి సాధించాలనుకున్నాం'' అని పంత్ తెలిపాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ టైటాన్స్ 17.3 ఓవర్లో 89 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (31; 24 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్ (3/14) మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (20; 10 బంతుల్లో, 2x4, 2x6), షై హోప్ (19; 10 బంతుల్లో, 1x4, 2x6), రిషభ్ పంత్ (16*; 11 బంతుల్లో, 1x4, 1x6), అభిషేక్ పోరెల్ (15; 7 బంతుల్లో, 2x4, 1x6), సుమిత్‌ (9*; 9 బంతుల్లో, 2x4) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.

Story first published: Thursday, April 18, 2024, 8:13 [IST]
Other articles published on Apr 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+