Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన పంత్.. రికార్డులన్నీ బ్రేక్!

ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్‌ను ఆరు వికెట్లతో చిత్తుచిత్తుగా ఓడించింది. తొలుత గుజరాత్‌ను 17.3 ఓవర్లో 89 పరుగులకు ఆలౌట్ చేసింది. ముకేశ్ కుమార్ (3/14) మూడు వికెట్లతో సత్తాచాటాడు. రషీద్ ఖాన్ (31; 24 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (20; 10 బంతుల్లో, 2x4, 2x6), షై హోప్ (19; 10 బంతుల్లో, 1x4, 2x6), రిషభ్ పంత్ (16*; 11 బంతుల్లో, 1x4, 1x6), అభిషేక్ పోరెల్ (15; 7 బంతుల్లో, 2x4, 1x6), సుమిత్‌ (9*; 9 బంతుల్లో, 2x4) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.

GT vs DC Pant Sets Record for Most Dismissals by a DC WK in an IPL Innings Alongside Dinesh Karthik

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా (2; 10 బంతుల్లో), సాయి సుదర్శన్ (12; 9 బంతుల్లో, 2x4), డేవిడ్ మిల్లర్ (2; 6 బంతుల్లో), అభినవ్ మనోహర్ (8; 14 బంతుల్లో, 1x4), షారుక్ ఖాన్ (డకౌట్), రాహుల్ తెవాతియా (10; 15 బంతుల్లో, 1x4), మోహిత్ శర్మ (2; 14 బంతుల్లో) పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/14) మూడు, ఇషాంత్ శర్మ (2/8), ట్రిస్టన్ స్టబ్స్ (2/11) తలో రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్ (1/18), అక్షర్ పటేల్ (1/17) తలో వికెట్ తీశారు.

అయితే బ్యాటుతో పాటు గ్లవ్స్‌తోనూ చెలరేగిన పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించడంలో భాగస్వామ్యమైన ఢిల్లీ వికెట్‌కీపర్‌గా చరిత్రకెక్కాడు. గుజరాత్ బ్యాటర్లలో నలుగురును ఔట్ చేయడంలో పంత్ సహకరించాడు. రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్‌లు అందుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌పై 2009లో దినేశ్ కార్తీక్ (4) సాధించిన రికార్డు ఇవాళ సమమైంది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ పేలవమైన రికార్డులు నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు (89). అంతకుముందు 2023లో ఢిల్లీపై చేసిన 125/6 స్కోరే అత్యల్పంగా ఉండేది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓ జట్టు చేసి అత్యంత తక్కువ స్కోరు కూడా ఇదే. 2012లో ముంబై ఇండియన్స్ చేసిన 92 పరుగుల లోయెస్ట్ స్కోరు చెత్త రికార్డును గుజరాత్ ఇవాళ బ్రేక్ చేసింది.

Story first published: Wednesday, April 17, 2024, 22:43 [IST]
Other articles published on Apr 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+