Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT VS DC: కేఎల్ రాహుల్ కౌంటర్ - కెవిన్ పీటర్సన్‌కు దిమ్మ తిరిగే!

GT VS DC: దిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌.. ఆ జట్టు మెంటార్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ కెవిన్ పీటర్సన్ పై సెటైర్లు వేశాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచు సందర్భంగా నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్‌ సెషన్‌ సమయంలో కెవిన్‌పై పంచులు వేశాడు రాహుల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులకు నవ్వులు పూయిస్తోంది.

అసలేం జరిగిందంటే?
ఏప్రిల్‌ 5న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్ జరిగిన తర్వాత దిల్లీ మెంటార్ కెవిన్‌ పీటర్సన్ మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. టోర్నీ మధ్యలో అక్కడికి వెళ్లి వచ్చాడు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి జట్టులో చేరాడు. అయితే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచు సందర్భంగా ప్రాక్టీస్‌ సెషన్‌లో ఉన్న ఆటగాళ్లను కలిశాడు. ఈ క్రమంలోనే మొదటగా గుజరాత్‌ కెప్టెన్‌ శుభమన్‌ గిల్ ను కలిసి ముచ్చటించాడు.

GT VS DC live KL Rahul trolls Kevin Pietersen for going to Maldives in Midseason IPL 2025

మాల్దీవులకు వెళ్లేవాడే మెంటార్..
'హలో ఎలా ఉన్నావు బ్రదర్? ఏంటి సంగతులు?' అని గిల్ ను అడిగాడు కెవిన్. అదే సమయంలో 'మెంటార్‌ బాధ్యత ఏంటి..?' అని కూడా అడిగాడు. దీనికి వెంటనే, అక్కడే ఉన్న కేఎల్ రాహుల్ కలుగజేసుకుని.. కెవిన్ పై సెటైర్లు వేశాడు. 'సీజన్ మధ్యలో మాల్దీవులకు వెళ్లేవాడు మెంటార్' అని సరదగా బదులిచ్చాడు. దీంతో అక్కడున్నవారంతా తెగ నవ్వుకున్నారు. ఈ వీడియోను దిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.

పీటర్సన్ తిరిగి కౌంటర్..
అయితే కేఎల్ రాహుల్ సెటైర్లుపై పీటర్సన్ ఆన్ ఫీల్డ్ లో స్పందించలేదు కానీ, ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగానే స్పందించాడు "ఒక క్రికెట్ జట్టు మెంటార్ అంటే టాక్టికల్ జీనియస్ తో పాటు సెలవుల ప్రణాళికలోనూ నైపుణ్యం కలవాడు. పర్ఫెక్ట్‌ స్విచ్‌-హిట్‌ నేర్పించడం మాత్రమే కాదు, సీజన్‌ మధ్యలో బెస్ట్‌ వెకేషన్‌ డీల్స్‌ ఎలా కనుక్కోవాలనే సీక్రెట్ కూడా చెప్పగలిగేవాడు. ఒక చేతిలో క్లిప్‌బోర్డ్‌, మరొక చేతిలో ట్రావెల్‌ బ్రోచర్‌ పట్టుకుని ఉండగలిగేవాడు" అని రాసుకొచ్చాడు.

Story first published: Saturday, April 19, 2025, 15:00 [IST]
Other articles published on Apr 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+