For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs DC: ఢిల్లీ తుది జ‌ట్టులో తెలుగు కుర్రాడు.. గుజ‌రాత్ టీంలో కీల‌క మార్పులు.. తుది జ‌ట్లు ఇవే!

GT vs DC: KS Bharat in DC.. Key Changes in Delhi Capitals vs Gujarat titans Playing 11

ఐపీఎల్ 2022లో నేడు రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. సాయంత్రం 3:30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక రాత్రి 7:30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న రెండో మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డనున్నాయి. అయితే రాత్రి జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్న గుజ‌రాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల ప్లేయింగ్ 11పై ఆస‌క్తి నెల‌కొంది. కాగా ఇరు జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌ల్లో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్నాయి.

ఢిల్లీ బ్యాట‌ర్లు వీళ్లే

ఢిల్లీ బ్యాట‌ర్లు వీళ్లే

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. గ‌త మ్యాచ్‌లో విఫ‌ల‌మైన మ‌నీదీప్ సింగ్ స్థానంలో తెలుగు కుర్రాడు కేఎస్ భ‌ర‌త్‌ను ఆడించే అవకాశం ఉంది. ఇది మిన‌హా బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో పెద‌గా మార్పులు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన వెస్టిండీస్ బ్యాట‌ర్ రోవ్మాన్ పావెల్ మ‌రో అవ‌కాశం ఇచ్చే అవ‌కాశం ఉంది. ఓపెన‌ర్లుగా ఈ మ్యాచ్‌లో కూడా పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్ బ‌రిలోకి దిగ‌నున్నారు. మూడో స్థానంలో కేఎస్ భ‌ర‌త్ బ్యాటింగ్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌గా.. నాల్గో స్థానంలో కెప్టెన్ రిష‌బ్ పంత్ ఆడ‌నున్నాడు. ఐదో స్థానంలో ల‌లిత్ యాద‌వ్, ఆరో స్థానంలో రోవ్మాన్ పావెల్ బ్యాటింగ్‌కు రానున్నారు.

బౌల‌ర్లు వీళ్లే

బౌల‌ర్లు వీళ్లే

ఇక ఏడో స్థానంలో ఆల్‌రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్ ఆడ‌నున్నాడు. ఎనిమిదో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ పటేల్ బ్యాటింగ్ చేయ‌నున్నాడు. మొత్తంగా ఎనిమిదో స్థానం వ‌ర‌కు బ్యాటింగ్ ఉండ‌డంతో ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డ‌ర్ బ‌లంగా కనిపిస్తుంది. స్పిన్ బౌల‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్‌, పేస్ బౌల‌ర్లుగా క‌మ‌లేష్ న‌గ‌ర‌కోటి, ఖ‌లీల్ అహ్మ‌ద్ బ‌రిలోకి దిగ‌నున్నారు. ఆల్‌రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్ కూడా పేస్ బౌల‌రే అనే సంగతి తెలిసిందే.

గుజ‌రాత్ బ్యాట‌ర్లు వీళ్లే

గుజ‌రాత్ బ్యాట‌ర్లు వీళ్లే

గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో పెద‌గా మార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపించడం లేదు. గ‌త మ్యాచ్‌లో బ‌రిలోకి దిగిన బ్యాటింగ్ ఆర్డ‌ర్‌తోనే గుజ‌రాత్ ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవ‌కాశం ఉంది. ఓపెన‌ర్లుగా శుభ్‌మాన్ గిల్, మాథ్యువేడ్ ఆడ‌నుండ‌గా.. మిడిలార్డ‌ర్‌లో విజ‌య్ శంక‌ర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్ల‌ర్, రాహుల్ తెవాటియా, అభిన‌వ్ మ‌నోహ‌ర్ బ్యాటింగ్ చేయనున్నారు.

 బౌల‌ర్లు వీళ్లే

బౌల‌ర్లు వీళ్లే

ఇక పేస్ బౌల‌ర్లుగా మ‌హ్మ‌ద్ ష‌మీ, వ‌రుణ్ హారోన్ బ‌రిలోకి దిగ‌నున్నారు. ప్ర‌ధాన‌ స్పిన్న‌ర్‌గా ర‌షీద్ ఖాన్ ఆడ‌నుండ‌గా.. అత‌నికి తోడుగా జ‌యంత్ యాద‌వ్‌ను బ‌రిలోకి దించే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఒక వేళ జ‌యంత్ యాద‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకుంటే ఫెర్గ్యుస‌న్‌కు ప్లేయింగ్ 11లో చోటు ద‌క్క‌ద‌ని చెప్పుకోవాలి. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతోపాటు విజ‌య్ శంక‌ర్ ఆల్‌రౌండ‌ర్ పాత్ర‌ల‌ను పోషించ‌నున్నారు.

తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌: పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, కేఎల్ భ‌ర‌త్, రిష‌బ్ పంత్ (కెప్టెన్‌, వికెట్ కీప‌ర్), ల‌లిత్ యాద‌వ్, రోవ్మాన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, క‌మ‌లేష్ న‌గ‌ర‌కోటి, ఖ‌లీల్ అహ్మ‌ద్.

గుజ‌రాత్ టైటాన్స్‌: శుభ్‌మాన్ గిల్, మాథ్యువేడ్ (వికెట్ కీప‌ర్), విజ‌య్ శంక‌ర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), డేవిడ్ మిల్ల‌ర్, రాహుల్ తెవాటియా, అభిన‌వ్ మ‌నోహ‌ర్, ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, వ‌రుణ్ హ‌రోన్, జ‌యంత్ యాద‌వ్‌.

Story first published: Saturday, April 2, 2022, 12:28 [IST]
Other articles published on Apr 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+