Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారిద్దరు రూత్‌లెస్ - నా టైమ్ వస్తది.. లెక్క సరి చేస్తా!: గిల్

GT vs DC: ఐపీఎల్ 2025లో తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో జాస్ బట్లర్ (97) చెలరేగి ఆడాడు. సాయి సుదర్శన్ (36), రూథర్ ఫోర్డ్ (43) అదరగొట్టారు. ఆఖర్లో రాహుల్ తెవాతియా (11) మెరుపులు మెరిపించి మ్యాచును ముగించాడు. కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (7) మాత్రం నిరాశపరిచాడు.

నా టైమ్ కూడా వస్తది..
"ఓ దశలో వాళ్ల స్కోరు 220-230 వెళ్తుందేమో అనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతం చేశారు. వారిని కట్టడి చేశారు. మేం ఛేజింగ్, డిఫెండింగ్ బాగా చేస్తున్నాం. అక్సర్ పటేల్ క్రీజులో ఉన్నంత సేపు, వారు గేమ్ లో ముందున్నారు. అయితే ఫాస్ట్ బౌలర్లను వారు ఎదుర్కోవడం కష్టం. అందుకే మేం ఫాస్ట్ బౌలర్లను కొనసాగించాలని అనుకున్నాం. నేను రన్-అవుట్‌ అవ్వడం నిరాశ కలిగించింది. కానీ ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నా టైమ్ వస్తుందని ఆశిస్తున్నా. అప్పుడు నేనెంటో చూపిస్తా. బట్లర్, రూదర్ ‌ఫోర్డ్ స్ట్రైక్ అద్భుతంగా ఆడారు. వారి షాట్లు అద్భుతం. వాళ్లు కేవలం బలంగా మాత్రమే కొట్టలేదు, స్ట్రైక్ రొటేట్ చేస్తూ, చాలా కాల్క్యులేటెడ్ షాట్లు ఆడారు. వారి ఆట చూడటానికి అద్భుతంగా ఉంది. విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది." అని గిల్ చెప్పుకొచ్చాడు.

GT vs DC IPL 2025 Shubman Gill praises Butter and Rutherford says his chance will also get in future

ఆలోచించొద్దు అని చెప్పా..
ఈ మ్యాచులో కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్న జోస్ బట్లర్ (97) మ్యాచు చివరి వరకు క్రీజులో ఉన్న సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు. జట్టు విజయం కోసం త్యాగం చేశాడు. దీంతో చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరమైన నేపథ్యంలో రాహుల్ తెవాతియా (11*; 3 బంతుల్లో) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. దీని గురించి జోస్ బట్లర్ మాట్లాడుతూ.. "రాహుల్ తెవాతియాతో నా హండ్రెడ్ గురించి కంగారు పడొద్దు, నువ్వు మ్యాచును గెలిపించగలిగితే అదే సరిపోతుంది అని చెప్పాను. సెంచరీ చేయడం మంచిదే, కానీ విజయం అంతకుమించి." అని చెప్పాడు.

Story first published: Saturday, April 19, 2025, 20:58 [IST]
Other articles published on Apr 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+