Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT VS DC: ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతం..!

GT VS DC: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచులో ప్రసిద్ధ్ కృష్ణ అదిరే ప్రదర్శన చేశాడు. సాధారణంగా అతడు రన్స్ ఎక్కువ ఇచ్చేస్తాడని అంతా అనుకుంటుంటాం. కానీ ఈ సారి అతడు అద్భుతం చేశాడు. తన అద్భుతమైన పేస్, సీమింగ్ బౌలింగ్ తో కీలక వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు దిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. 4 ఓవర్లు వేసిన అతడు 10.20 ఎకానమీతో 4 వికెట్లు తీసి కేవలం 41 పరుగులే సమర్ఫించుకున్నాడు. తద్వారా ఈ సీజన్ లో తన స్పెల్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ను నమోదు చేశాడు. ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ హోల్టర్ గానూ అతడే కొనసాగుతుండటం విశేషం.

కేఎల్ రాహుల్‌ను భలే వెనక్కి..
ఈ మ్యాచులో ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna).. దిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (28)ను ఔట్ చేయడం బాగా ఆకట్టుకుంది. తన అద్భుతమైన యార్కర్ బంతితో రాహుల్ వికెట్ తీశాడు ప్రసిద్ధ్. దీంతో 4.4 ఓవర్ 58 పరుగులు వద్ద దిల్లీ తన రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న కరుణ్ నాయర్ ను షార్ట్ బాల్ వేసి ఊరించి మరీ పెవిలియన్ కు పంపాడు. దీంతో 8.2 ఓవర్ దగ్గర కరుణ్ నాయర్.. అర్షద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా 93 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది దిల్లీ. అనంతరం మళ్లీ దిల్లీ నాలుగో వికెట్ కోల్పోవడంలో ప్రసిద్ధ్ కృష్ణనే కీలకంగా వ్యవహరించాడు. సిరాజ్ బౌలింగ్ లో స్టబ్స్.. ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

GT VS DC IPL 2025 Prasidh Krishna took 4 wickets conceded 41 runs against delhi capitals

ఒకే ఓవర్ లో రెండు వికెట్లు..
17 ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ.17.1 ఓవర్ దగ్గర అక్షర్ పటేల్ ను పెవిలియన్ పంపాడు ప్రసిద్ధ్. ఆ వెంటనే 17.2 ఓవర్ వద్ద విప్రరాజ్ నిగమ్ ను కూడా ఔట్ చేశాడు. విప్రరాజ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు.

ఎవరెలా రాణించారంటే?
మొత్తంగా ఈ ఇన్నింగ్స్ లో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్‌ (39), అశుతోష్‌ శర్మ (37), కరుణ్‌ నాయర్‌ (31), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (31) రాణించారు. కేఎల్‌ రాహుల్‌ (28) ఫర్వాలేదనిపించాడు. అభిషేక్‌ పోరెల్‌ (18), విప్రాజ్‌ నిగమ్‌ (0), డొనోవన్‌ ఫెరియెరా (1), స్టార్క్‌ ( 2 నాటౌట్‌), కుల్దీప్‌ (4 నాటౌట్‌) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, సాయికిషోర్‌ తలో వికెట్‌ తీశారు.

Story first published: Saturday, April 19, 2025, 18:09 [IST]
Other articles published on Apr 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+