GT VS DC: భారీ సిక్స్ - కోహ్లీ,రోహిత్, ధోనీ సరసన కేఎల్ రాహుల్!
GT VS DC: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200 సిక్సులు బాదిన ఫాసెస్ట్ ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు.
భారీ సిక్స్ బాది ఘనత..(KL Rahul 200 six record)
తన 128వ ఇన్నింగ్స్ లో 200 సిక్సుల మార్క్ ను దాటాడు కేఎల్ రాహుల్. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా భారీ సిక్స్ (89 మీటర్లు) బాది.. ఈ ఫీట్ అందుకున్నాడు రాహుల్. ఊహించని విధంగా బంతిని స్టాండ్స్‌లోకి పంపించి అదరగొట్టాడు. ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది 200వ సిక్స్ కావడం విశేషం.

అగ్రస్థానంలో ఎవరున్నారంటే
ఓవరాల్ గా ఈ ఫీట్ ను అత్యంత వేగంగా అందుకున్న మూడో క్రికెటర్ గా నిలిచాడు కేఎల్ రాహుల్. ఈ జాబితాలో అగ్రస్థానంలో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. అతడు 69 ఇన్నింగ్స్ లోనే ఐపీఎల్ లో 200 సిక్సులు కొట్టాడు. ఆ తర్వాత మరో విండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్.. 97 ఇన్నింగ్స్ లో దీన్ని అందుకున్నాడు.
- ఏ క్రికెటర్ ఎన్ని ఇన్నింగ్స్ లో 200 సిక్సుల మార్క్ అందుకున్నారంటే
- క్రిస్ గేల్ - (69)
- ఆండ్రూ రస్సెల్ - (97)
- కేఎల్ రాహుల్ - (128)
- ఏబీ డివిలియర్స్ - (137)
- డేవిడ్ వార్నర్ - (148)
- కీరన్ పొలార్డ్ - (150)
- ఐపీఎల్ లో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్లు వీరే
- క్రిస్ గేల్ - 357 సిక్సులు
- రోహిత్ - 286
- విరాట్ - 282
- ధోనీ - 260
- ఏబీ డివిలియర్స్ - 251
- వార్నర్ - 236
- కీరన్ పొలార్డ్ - 223
- సంజూ శాంసన్ - 216
- యాండ్రూ రసెల్ - 212
- సురేశ్ రైనా - 213
- కేఎల్ రాహుల్ - 200
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications