Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుజరాత్ చరిత్రలో అత్యల్ప స్కోరు.. దుమ్ముదులిపిన ఢిల్లీ బౌలర్లు

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న అహ్మదాబాద్ పిచ్‌పై సమష్టిగా రెచ్చిపోయారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. రషీద్ ఖాన్ (31; 24 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌ ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8; 6 బంతుల్లో, 2x4) పెవిలియన్‌కు చేరాడు. ఇషాంత్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన గిల్ కవర్‌లో ఉన్న పృథ్వీ షా చేతికి చిక్కాడు. ఆ తర్వాత గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆతిథ్య జట్టు గుజరాత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఢిల్లీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.

GT vs DC Gujarat Titans have been bundled out their lowest-ever total in the history of IPL

పవర్‌ప్లేలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత 48 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించినా గుజరాత్‌కు ఎలాంటి లాభం లేకపోయింది. సాయి సుదర్శన్ (12; 9 బంతుల్లో, 2x4) స్థానంలో వచ్చిన షారుక్ ఖాన్ డకౌటయ్యాడు.

మరోవైపు సహచరులు వెనుదిరుగుతున్నా రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ తన పోరాటం కొనసాగించాడు. స్కోరుబోర్డును నిలకడగా ముందుకు నడిపించాడు. ఢిల్లీకీ గుజరాత్ ఆ మాత్రం లక్ష్యాన్ని నిర్దేశించిందంటే రషీద్ ఖాన్ వల్లనే. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క సిక్సర్ నమోదవ్వగా, అది రషీదే బాదాడు.

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా (2; 10 బంతుల్లో), సాయి సుదర్శన్ (12; 9 బంతుల్లో, 2x4), డేవిడ్ మిల్లర్ (2; 6 బంతుల్లో), అభినవ్ మనోహర్ (8; 14 బంతుల్లో, 1x4), షారుక్ ఖాన్ (డకౌట్), రాహుల్ తెవాతియా (10; 15 బంతుల్లో, 1x4), మోహిత్ శర్మ (2; 14 బంతుల్లో), నూర్ అహ్మద్ (1; 7 బంతుల్లో) పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/14) మూడు, ఇషాంత్ శర్మ (2/8), ట్రిస్టన్ స్టబ్స్ (2/11) తలో రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్ (1/18), అక్షర్ పటేల్ (1/17) తలో వికెట్ తీశారు.

Story first published: Wednesday, April 17, 2024, 21:21 [IST]
Other articles published on Apr 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+