Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుజరాత్‌ టైటాన్స్‌‌ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

గుజరాత్ టైటాన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుచిత్తుగా ఓడించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బంతితో చెలరేగిన ఢిల్లీ.. గుజరాత్‌ను 89 పరుగులకే కట్టడిచేసింది. ముకేశ్ కుమార్ (3/14) చెలరేగడంతో 17.3 ఓవర్లలో గుజరాత్ ఆలౌటైంది. రషీద్ ఖాన్ (31; 24 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప స్కోరు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (20; 10 బంతుల్లో, 2x4, 2x6) ఆది నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సందీప్ వారియర్ వేసిన తొలి ఓవర్‌లో ఓ సిక్సర్, బౌండరీ బాది 14 పరుగులు సాధించాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన రెండో ఓవర్‌లోనూ సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే ఆఖరి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

GT vs DC Delhi Capitals Triumph Over Gujarat Titans

లక్ష్యాన్ని వేగంగా సాధించాలని దూకుడుగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్లు కోల్పోయింది. ఓ వైపు బౌండరీలు, మరోవైపు వికెట్లతో ఢిల్లీ ఛేదన సాగింది. అయిదో ఓవర్ వేసిన సందీప్ వారియర్ బౌలింగ్‌లో ఢిల్లీ ఏకంగా 23 పరుగులు పిండుకుంది. షై హోప్ (19; 10 బంతుల్లో, 1x4, 2x6) వరుసగా ఓ ఫోర్, రెండు సిక్సర్లు బాదాడు.

అయితే అయిదో బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ పోరెల్ (15; 7 బంతుల్లో, 2x4, 1x6) ఆఖరి బంతికి క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆరో ఓవర్‌లో రషీద్ ఖాన్ రెండు పరుగులే ఇచ్చినప్పటికీ ఢిల్లీ పవర్‌ప్లేలో 67/4 స్కోరుతో నిలిచింది. అనంతరం పంత్ (16*; 11 బంతుల్లో, 1x4, 1x6) మిగిలిన పనిని పూర్తిచేశాడు. సుమిత్‌ (9*; 9 బంతుల్లో, 2x4)తో కలిసి జట్టను విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ పైచేయి సాధించలేదు. ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. ఆది నుంచే క్రమంగా వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ వికెట్‌తో గుజరాత్ పతనం మొదలైంది. పవర్‌ప్లేలో 30/4తో నిలచిన టైటాన్స్ 48 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ మోస్తారు ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది.

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా (2; 10 బంతుల్లో), సాయి సుదర్శన్ (12; 9 బంతుల్లో, 2x4), డేవిడ్ మిల్లర్ (2; 6 బంతుల్లో), అభినవ్ మనోహర్ (8; 14 బంతుల్లో, 1x4), షారుక్ ఖాన్ (డకౌట్), రాహుల్ తెవాతియా (10; 15 బంతుల్లో, 1x4), మోహిత్ శర్మ (2; 14 బంతుల్లో), నూర్ అహ్మద్ (1; 7 బంతుల్లో) పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/14) మూడు, ఇషాంత్ శర్మ (2/8), ట్రిస్టన్ స్టబ్స్ (2/11) తలో రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్ (1/18), అక్షర్ పటేల్ (1/17) తలో వికెట్ తీశారు.

Story first published: Wednesday, April 17, 2024, 22:22 [IST]
Other articles published on Apr 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+