శుభ్‌మన్ గిల్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. తన ఓపెనింగ్ భాగస్వామి సాయి సుదర్శన్‌తో కలిసి సీఎస్కే బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. గిల్ (104; 55 బంతుల్లో, 9x4, 6x6), సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5x4, 7x6) శతకాలతో విరుచుకుపడటంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు గుజరాత్ టైటాన్స్ 232 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. గిల్, సుదర్శన్ మొదటి వికెట్‌కు ద్విశతక (210) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడీగా గిల్-సుదర్శన్ రికార్డులకెక్కారు.

అయితే ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే గిల్ దూకుడుగా ఆడాడు. శాంట్నర్ వేసిన తొలి ఓవర్‌లో గిల్ ఫోర్, సిక్సర్ బాది ప్రత్యర్థికి తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు. పవర్‌ప్లేలో సుదర్శన్ నిదానంగా ఆడినా గుజరాత్ 58 పరుగులు చేసిందంటే అది గిల్ మెరుపు ఇన్నింగ్స్ వల్లే. ఎడాపెడా బౌండరీలతో హోరెత్తించిన గిల్ 25 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.
అనంతరం మరింత దూకుడుగా ఆడాడు. టాప్ గేర్‌లో పరుగులు సాధించాడు. సిమర్జిత్ బౌలింగ్‌లో బౌండరీ బాది 50 బంతుల్లో శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో గిల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో ఒకే వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లితో కలిసి గిల్ చరిత్రకెక్కాడు. అహ్మదాబాద్ వేదికగా గిల్ నాలుగు సెంచరీ బాదాడు. చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి కూడా నాలుగు శతకాలు సాధించాడు.
ఓవరాల్‌గా టీ20ల్లో ఒకే వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. మీర్పూర్ వేదికగా గేల్ అయిదు శతకాలు బాదాడు. అతని తర్వాతి స్థానాల్లో మైకేల్ క్లింగెర్ (బ్రిస్టల్ వేదికగా 4 సెంచరీలు), కోహ్లి, గిల్ సంయుక్తంగా ఉన్నారు. కాగా, టీ20 ఫార్మాట్‌లో అహ్మదాబాద్ వేదికగా 19 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 71 సగటు, 163 స్ట్రైక్‌రేటుతో 1079 పరుగులు చేశాడు.
గిల్ మరో రికార్డు నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆరు సెంచరీలు బాదిన గిల్ రుతురాజ్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (9 సెంచరీలు), రోహిత్ శర్మ (8 సెంచరీలు) టాప్-2లో ఉన్నారు.