
రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ముందు చెన్నైసూపర్ కింగ్స్ 170 పరుగుల టఫ్ లక్ష్యాన్ని ఉంచింది. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కూడా 46 పరుగులతో రాణించాడు. ఇక చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడడంతో సీఎస్కే స్కోర్ 169కి చేరుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైసూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. రాబిన్ ఊతప్ప(3), మెయిన్ అలీ(1) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. వీరిని మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్ ఫెమిలియన్ చేర్చారు. దీంతో పవర్‌ప్లేనే సీఎస్కే 32 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో చెన్నైని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 55 బంతుల్లో 92 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌లో 8వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.