GT vs CSK: ఐపీఎల్‌లో అంబటి రాయుడు ఖాతాలో సూపర్ రికార్డు.. 4 వేల రన్స్ క్లబ్‌లో చేరిక

ఐపీఎల్‌లో తెలుగు ఆటగాడు అంబటి రాయులు రికార్డు సృష్టించాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసిన 13వ ఆటగాడిగా రాయుడు నిలిచాడు. అలాగే ఈ ఘనత సాధించి 10వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో రాయుడు గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. ప్రస్తుతం చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 181 మ్యాచ్‌లాడిన రాయుడు 29 సగటుతో 4044 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు.. ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులుగా ఉంది. మొత్తంగా 126 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన రాయుడు 337 ఫోర్లు, 154 సిక్సులు బాదాడు.
ఇక గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైసూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. రాబిన్ ఊతప్ప(3), మెయిన్ అలీ(1) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. వీరిని మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్ ఫెమిలియన్ చేర్చారు. దీంతో పవర్‌ప్లేనే సీఎస్కే 32 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో చెన్నైని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 55 బంతుల్లో 92 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌లో 8వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ భాగస్వామ్యాన్ని 15వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ విడదీశాడు. 31 బంతుల్లో 46 పరుగులు చేసిన రాయుడు.. విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం యష్ దయాల్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రుతురాజ్ గైక్వాడ్.. అభినవ్ మనోహర్‌కు దొరికిపోయాడు. దీంతో 131 పరుగుల వద్ద చెన్నైసూపర్ కింగ్స్ నాల్గో వికెట్ కోల్పోయింది. 48 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ గైక్వాడ్ 5 ఫోర్లు, 5 సిక్సులతో 73 పరుగులతో చెలరేగాడు. అనంతరం శివమ్ దూబే, కెప్టెన్ రవీంద్ర జడేజా సీఎస్కే ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన గుజరాత్ బౌలర్లు భారీగా పరుగులు రానివ్వలేదు. అయితే ఫెర్గ్యూసన్ వేసిన చివరి ఓవర్లో శివమ్ దూబే ఓ ఫోర్, రవీంద్ర జడేజా 2 సిక్సులు కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నైసూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. చివరి 5 ఓవర్లలో సీఎస్కే 44 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. శివమ్ దూబే(19) చివరి బంతికి రనౌట్ అవగా.. 12 బంతుల్లోనే 22 పరుగులు చేసిన జడేజా నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో జోసెఫ్ 2, షమీ, దయాల్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications