Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆమె ఓకే చెప్పిందట.. గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన గుజరాత్ టైటాన్స్ స్టార్!

గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గుడ్ న్యూస్ చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవడానికి గర్ల్‌ఫ్రెండ్ కామిలా ఒప్పుకుందంటూ వెల్లడించాడు. ఈ సౌతాఫ్రికా స్టార్ కొంత కాలంగా కామిలా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. తాజాగా మిల్లర్ ప్రపోజ్ చేయగానే.. ఆమె ఓకే చెప్పిందట. ఈ విషయాన్ని మిల్లర్ తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించాడు.

ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న మిల్లర్.. జింబాబ్వేలోని ఎంపాలా జేనాలో ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఈ సందర్భంగా తన గర్ల్‌ఫ్రెండ్ చేతికి తొడిగిన ఉంగరం ఫొటోలను కూడా మిల్లర్ తన అభిమానులతో పంచుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అత్యద్భుతమైన బ్యాటర్లలో మిల్లర్ ఒకడనే సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా తరఫున అద్భుతంగా రాణించిన అతను.. ఐపీఎల్‌లో కూడా తన సత్తా చాటాడు.

David Miller

'కిల్లర్ మిల్లర్' అని ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకునే ఈ డ్యాషింగ్ బ్యాటర్.. గతేడాది ఐపీఎల్‌ ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది కూడా ఫర్వాలేదనిపించాడు. కొన్ని రోజుల క్రితం వరకు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అతనికి ఆసీస్‌తో జరిగే టీ20ల్లో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు విశ్రాంతినిచ్చింది. ఈ సందర్భంగా గర్ల్‌ఫ్రెండ్‌ను జింబాబ్వే తీసుకెళ్లిన అతను.. ఆమెకు ప్రపోజ్ చేశాడు.

ఈ మధుర ఘట్టానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్న మిల్లర్.. 'తను ఒప్పుకుంది. కామిలా మిల్లర్ పేరు బాగుంది కదా' అని పోస్టు పెట్టాడు. దీనిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెంటనే స్పందించాడు. హార్ట్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌‌లో మిల్లర్‌తో కలిసి ఆడిన మహిపాల్ లోమ్రోర్, జీటీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా మిల్లర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కూడా మిల్లర్ సంతోషాన్ని పంచుకుంది. మిల్లర్ షేర్ చేసిన ఫొటోలతో ప్రత్యేకమైన పోస్టును రెడీ చేసి 'మిల్లర్లను కలిశారా?' అంటూ దాన్ని షేర్ చేసింది. ఇది చూసిన జీటీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఆసీస్‌తో జరిగే వన్డే సిరీసులో మిల్లర్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. భారతీయ పరిస్థితుల్లో మంచి రికార్డు ఉణ్న అతను వరల్డ్ కప్‌లో కూడా సఫారీలకు కీలకం కానున్నాడు.

Story first published: Friday, September 1, 2023, 7:27 [IST]
Other articles published on Sep 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+