Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsCSK : ఆ కుర్రాడికి నో ఛాన్స్.. చెన్నైను ఢీకొట్టే గుజరాత్ టీం ఇదే..!

ఐపీఎల్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో పదింట జయభేరి మోగించిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. ఇక గతేడాదితో పోలిస్తే అద్భుతంగా పుంజుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి.

ఇప్పటి వరకు చెన్నైపై గుజరాత్ ఓటమి ఎరుగదు. ఈ క్రమంలో ఈ టీ మరోసారి ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే కొన్ని విషయాల్లో గుజరాత్ కూడా తమ టీంలో కొన్ని మార్పులు చేసుకోక తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా చెపాక్ పిచ్‌పై బౌలింగ్ చాలా కీలకంగా మారుతుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

gujarat titans team for csk

ఈ క్రమంలోనే గుజరాత్ బౌలింగ్‌లో యష్ దయాళ్‌కు చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ప్లేయర్ రింకూ సింగ్ ఇతని బౌలింగ్‌లోనే వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో అతన్ని కొంతసేపు పక్కన పెట్టిన గుజరాత్ టీం మేనేజ్‌మెంట్.. మళ్లీ అతనికి అవకాశం ఇచ్చింది. అయితే అతను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.

పునరాగమనం తర్వాత రెండు మ్యాచులు ఆడిన అతను రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు, ఈ రెండు మ్యాచుల్లో కలిపి 70 పరుగులపైగా ఇచ్చాడు. దీంతో అతన్ని పక్కన పెట్టేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు జోష్ లిటిల్, అల్జారీ జోసెఫ్ రెడీగా ఉన్నారు.

వీరిద్దరిలో అల్జారీ జోసెఫ్‌పై టీం మేనేజ్‌మెంట్ ఎక్కువగా నమ్మకం పెట్టేలా కనిపించడం లేదు. అంతేకాదు, సీజన్ ఆరంభంలో గుజరాత్ తరఫున లిటిల్ చక్కగా బౌలింగ్ చేశాడు. ఐర్లాండ్ మ్యాచులు ఉండటంతో వెళ్లిన అతను తాజాగా మళ్లీ వచ్చి జట్టుతో చేరాడు. క్వాలిఫైయర్‌కు ముందు నెట్స్‌లో కూడా చాలా కష్టపడుతున్నాడు.

లిటిల్ అయితే గుజరాత్ బౌలింగ్‌లో ఎడం చేతి వాటం పేసింగ్ ఆప్షన్ కూడా తీసుకొస్తాడు. షమీ, రషీద్‌తో బలంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని మరింత బలంగా మారుస్తాడు. అలాగే బ్యాటింగ్‌లో జడేజా ప్రమాదాన్ని నిలువరించేందుకు ఎడం చేతి వాటం బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోవాలని జీటీ యాజమాన్యం అనుకుంటోంది.

ఈ క్రమంలో సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్‌లో ఒకరికి ఈ జట్టులో అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. వీరిని కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే ఛాన్స్ ఉంది. సాయి అయితే మిడిలార్డర్‌ను బలోపేతం చేస్తాడు. అదే సమయంల అభినవ్ అయితే చివర్లో భారీ షాట్లత గుజరాత్‌కు మంచి స్కోరు అందిస్తాడు. వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం గుజరాత్‌కు పెద్ద కష్టమే.

గుజరాత్ జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

Story first published: Tuesday, May 23, 2023, 12:33 [IST]
Other articles published on May 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+