ధోనీ.. కొంచెం తెలివిగా, ఇంకొంచెం తీయగా మారాలి: సాక్షి వినూత్న శుభాకాంక్షలు

రాంచీ: భారత క్రికెట్ చరిత్రలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెరగని ముద్ర వేశాడు. తన కూల్ కెప్టెన్సీతో ఎవరికీ సాధ్యం కాని విధంగా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించాడు. క్రికెట్ ప్రపంచంలో ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్ కూడా. మహీని ఆదర్శంగా తీసుకుని ఎందరో యువకులు క్రికెట్ వైపు అడుగులేశారు. అయితే మహేంద్రుడు బ్యాట్ పట్టి ఏడాది గడుస్తున్నా.. క్రికెట్ ప్రేమికుల్లో ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు.

వినూత్న శుభాకాంక్షలు చెప్పిన సాక్షి:
భారత సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఆయన సతీమణి సాక్షి సింగ్ ధోనీ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ ఫామ్‌హౌజ్‌లో ధోనీతో దిగిన పలు ఫొటోలను పంచుకున్నారు. 'నీ పుట్టిన రోజు గుర్తు చేసుకుంటూ.. ఒక సంవత్సరం గడిచిపోయింది. నీకు కాస్త వయసు పెరిగింది. నువ్ కొంచెం తెలివిగా, ఇంకొంచెం తీయగా మారాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎలాంటి వ్యక్తివంటే.. తీయని శుభాకాంక్షలు, బహుమతులకు లొంగనివాడివి. కేకు కోసి, క్యాండిల్స్ వెలిగించి నీ జీవితంలోని మరో ఏడాదిని సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీబర్త్‌డే భర్త గారు' అని సాక్షి పోస్టుకు కామెంట్ రాసారు.

నా అభిమాన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు:
టీమిండియా వెటరన్ ఆటగాడు సురేష్ రైనా మాజీ సారథికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. 'నా అభిమాన మనిషి, సోదరుడు మరియు నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తన మనసు, హృదయంతోనే ఆట ఆడుతాడు. కెప్టెన్సీ నిర్ణయాల వల్ల మాత్రమే మహీ విజయవంతం కాలేదు, జట్టులోని ప్రతి సభ్యుడిపై నమ్మకం ఉంచుతాడు. గెలుపును అలవాటుగా చేసుకున్న మా ప్రత్యేక నంబర్ 7కు ధన్యవాదాలు' అని రైనా పేర్కొన్నాడు.
మహీ నామస్మరణంతో ఊగిపోతున్న సోషల్ మీడియా:
అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్, మాజీ కెప్టెన్ గౌరవ్ గంగూలీ, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా, హార్దిక్ పాండ్యా సైతం మహీకి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ధోనీకి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు మహీ నామస్మరణంతో ఊగిపోతున్నాయి.
ఐసీసీ స్పెషల్ వీడియో:
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా ఎంఎస్ ధోనీ బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో మహీ బ్యాటింగ్ చేసే విజువల్స్‌తో పాటు.. ధోనీ గురించి విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్, సచిన్ టెండూల్కర్, జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతున్న క్లిప్పింగ్‌లను జత చేసింది. 'ఎవరైనా అతడిలాగే మంచివారని నేను అనుకోను' అనే ట్యాగ్‌ను వీడియో ట్వీట్‌కు జతచేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications