Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్‌గా గ్రెగరీ కింగ్

హైదరాబాద్: భారత జట్టు మాజీ ట్రైనర్ అయిన గ్రెగరీ కింగ్‌ను ట్రైనర్ చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టుకు ట్రైనర్‌గా నియమించింది. గత ఎనిమిది సీజన్ల నుంచి జట్టుకు సహకారమందిస్తోన్న గ్రెగరీనే ఆ జట్టుకు సరైన ట్రైనర్ అని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

'ఆటగాళ్లతో, కోచ్‌లతో, సహాయ సిబ్బంది, యజమానుల మధ్య చెన్నై సూపర్ కింగ్స్ మంచి సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. నేను మంచి జట్టుతో కలిసి ప్రయాణిస్తున్నాను. మొదటి ఎనిమిది సీజన్లలోనూ నేను ఈ జట్టులో భాగమైనందుకు సంతోషిస్తున్నాను.' అని గ్రెగరీ కింగ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

Gregory King appointed Chennai Super Kings trainer

సీఎస్‌కేలో భాగమవడం అంటే ఒక కుటుంబంలో భాగమైనట్లే అనిపిస్తుంది. మాకు ఈ ఎనిమిది సంవత్సరాలలో జట్టుతో మంచి జ్ఞాపకాలున్నాయి. ఐపీఎల్ భాగమవడమే చాలా గొప్ప విషయం.అని తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టాడు.

'ఐపీఎల్ ఎప్పుడు మొదలౌతుందా అనే ఆతురతతో ఎదురుచూస్తున్నా. మళ్లీ పాత మిత్రులను ఎప్పుడు కలుస్తానా అని ఆదుర్దాగా ఉంది.' అంటూ తన మనోగతాన్ని వ్యక్తపరిచాడు.

2008 నుంచి 2015 వరకు సీఎస్‌కే ఇప్పటికీ రెండు సార్లు లీగ్‌ను గెలుచుకుంది. నాలుగు సార్లు రన్నరప్‌గా నిలిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 14:54 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+