INDvsAUS : ఇప్పటికైనా మారండి.. ఆసీస్‌కు ఆ దేశ మాజీ లెజెండ్ చురకలు!

భారత్‌తో టెస్టు సిరీసులో ఆస్ట్రేలియా జట్టు అత్యంత పేలవ ప్రదర్శన చేస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడింది. దీనిపై పలువురు మాజీలు ఈ జట్టుపై మండిపడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా లెజెండ్ గ్రెగ్ ఛాపెల్ కూడా ఆసీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది తన వ్యక్తిగత కోపం కాదని, వరుస ఓటములతో రగిలిపోతున్న ఆస్ట్రేలియన్ల ఆగ్రహమని చెప్పాడు.

ఇంత ఘోరంగా ఓడతారా?
'ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా ఏం చెయ్యాలి? అదే సమస్య. ముందు వాళ్లు తమ బెస్ట్ జట్టును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఇదివరకటిలా ప్యాషన్, పట్టుదలతో ఆడాలి. అదే మన జట్టు హాల్‌మార్క్ అని మర్చిపోకూడదు. భారత్‌లో ఆడటం కష్టమని ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌కు కూడా తెలుసు. బలమైన జట్టు చేతిలో ఓడిపోవడాన్ని మేం కూడా ఒప్పుకుంటాం. కానీ రెక్లెస్‌గా ఆడుతూ ఒకటి, రెండు సెషన్లలోనే ఆలౌట్ అయిపోతున్న ఆస్ట్రేలియా టీంను చూస్తూ వాళ్లు ఊరికినే కూర్చోలేరు. మూడ్రోజుల్లోనే చాప చుట్టేయడం చూసిన మన అభిమానుల్లో కోపం, సిగ్గు, ఆశ్చర్యం అన్నీ పెరిగిపోతున్నాయి' అని ఛాపెల్ చెప్పాడు.

అది చూస్తే ఒళ్లు మండదా?
ఆస్ట్రేలియా జట్టు కనీసం పోరాట పటిమ కూడా చూపింకపోవడం వల్లనే ఆసీస్ ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. 'ఈ సిరీసులో ఆసీస్ జట్టు కనీసం పోరాటం కూడా చూపించలేదు. మొదటి బంతికే రివర్స్ స్వీప్ ఆడబోతూ ఒక బ్యాటర్ అవుటవడం, ఈ సిరీసులో ఆడటం వల్ల భవిష్యత్తుకు ఎలాంటి ఉపయోగం లేదన్నట్లు రెక్లెస్‌గా ఆడటం చూస్తే ఒళ్లు మండదా? భారత్‌తో ఆడటం ఏదో సైడ్‌షో అని ఆస్ట్రేలియా క్రికెట్ అర్థం చేసుకోవాలి. ఒక విధంగా ఇది యాషెస్ కన్నా పెద్ద షో అని వాళ్లు అర్థం చేసుకోవాలి' అని ఛాపెల్ మండిపడ్డాడు.

వాళ్లిద్దర్నీ ఆడించాలి..
మూడో టెస్టులో స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్, యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆడుతున్నట్లు తెలిసి ఛాపెల్ సంతోషం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరూ కొంత తడబడుతున్నా కూడా మూడో టెస్టులో కచ్చితంగా వారిని ఆడించాలని సూచించాడు. 'స్టార్క్, గ్రీన్ ఇద్దరినీ తక్కువ ఉపయోగించుకున్నా కూడా వాళ్లను ఆడించాలి. స్టార్క్ తనదైన రోజున మ్యాచ్ విన్నర్ అని మరువకూడదు. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ అతనితో బౌలింగ్ వేయించాలి. మిగతా సమయంలో గ్రీన్, బోలండ్ అతనికి సహకారం అందించాలి' అని ఛాపెల్ సలహా ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications