ఒకవేళ భారత్ వదిలేస్తే.. టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుంది: మాజీ క్రికెటర్

సిడ్నీ: ప్రపంచ క్రికెట్‌లో ఎల్బీడబ్యూ విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనను మార్చాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఒకవేళ భారత్ టెస్టు క్రికెట్‌ని వదిలేస్తే.. ఆ ఫార్మాట్ చచ్చిపోతుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రేగ్ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మినహా మరే దేశం కూడా టెస్టు క్రికెట్‌పై ఎక్కువ శ్రద్ధ కనబర్చడం లేదన్నాడు.

ఆ సమయంలో నన్ను ఓ నేరస్తుడిలా చూశారు.. నా ఇంటి మీద రాళ్ల దాడి చేశారు: యువీ

టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుంది

టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుంది

ప్లే రైట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చాట్ షో గ్రేగ్ చాపెల్‌ మాట్లాడుతూ... 'భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తప్ప మరే దేశం కూడా టెస్టు క్రికెట్‌పై ఆసక్తి కనబర్చడం లేదు. అందరూ టీ20లకు అలవాటు పడ్డారు. ఈ సమయంలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ అత్యుత్తమమని చెపుతున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌ సజీవంగా ఉంటుందనే ఆశలు కోహ్లీ మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఒకవేళ భారత్ టెస్టు క్రికెట్‌ని వదిలేస్తే.. ఆ ఫార్మాట్ చచ్చిపోతుంది' అని అన్నాడు.

వన్డే, టీ20లపై దృష్టి

వన్డే, టీ20లపై దృష్టి

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని క్రికెట్‌ బోర్డులు ఆర్థికంగా నష్టపోయాయి. కొన్ని బోర్డులు సగం జీతాలు ఇస్తుంటే.. మరికొన్ని ఆ మాత్రం కూడా ఇవ్వట్లేదు. కరోనా పరిస్థితులు మెరుగయి.. మళ్లీ క్రికెట్ మొదలైతే ఎక్కువగా టీ20 మ్యాచ్‌లను నిర్వహించాలని అన్ని క్రికెట్ దేశాలు భావిస్తున్నాయి. బీసీసీఐ కూడా ఇదే ఆలోచనలో ఉంది. టెస్టు క్రికెట్ కంటే.. వన్డే, టీ20లు ఎక్కువ ఆదాయం తెస్తాయి కాబట్టి అన్ని బోర్డులు ఈ విధంగా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాపెల్‌ పైవిధంగా పేర్కొన్నాడు. టీమిండియాకి కోచ్‌గా కొన్నాళ్లపాటు గ్రేగ్ చాఫెల్ వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఎల్బీ నిబంధనల్లో మార్పులు చేయాలి

ఎల్బీ నిబంధనల్లో మార్పులు చేయాలి

ఎల్బీ నిబంధనలపై ఇయాన్‌ చాపెల్‌ మాట్లాడుతూ... 'కొత్త ఎల్బీ నిబంధన సూటిగా ఉండాలి. పిచ్‌పై బంతి ఎక్కడ పడినా.. ఆఫ్‌స్టంప్‌ ఆవల ప్యాడ్‌ను తాకినా.. లైన్‌లో లేకపోయినా.. స్టంప్స్‌ తాకుతుందని అంపైర్‌కు అనిపిస్తే ఎల్బీగా ఔటివ్వా లి. దీని వల్ల ఆటలో న్యాయం జరుగుతుంది. బౌలర్‌ స్టంప్స్‌పైకి బంతులు సంధిస్తుంటే బ్యాట్స్‌మన్‌ తన వికెట్‌ కాపాడుకోడానికి బ్యాటునే ఉపయోగించాలి. గాయాలు కాకుండా ఉండేందుకే ప్యాడ్లు. ఔట్‌ కాకుండా కాదు' అని తెలిపాడు.

సిరీస్‌ను సాధించడం చాలా కష్టం

సిరీస్‌ను సాధించడం చాలా కష్టం

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా-భారత్‌ల టెస్టు సిరీస్‌ గురించి ఇటీవల మాట్లాడిన చాపెల్‌... ఈసారి టీమిండియా సిరీస్‌ను సాధించడం చాలా కష్టమన్నాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్‌ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండవచ్చు కానీ.. రాబోవు సిరీస్‌లో మాత్రం ఆసీస్‌ అంత తేలిగ్గా లొంగదన్నాడు. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లను తొందరగా పెవిలియన్‌కు పంపిస్తేనే టీమిండియా గెలిచే అవకాశముందున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, May 13, 2020, 12:46 [IST]
Other articles published on May 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X