డేవిడ్ వార్నర్‌పై ఎందుకంత కక్ష.. కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేయకపోవడంపై గ్రెగ్ చాపెల్ సీరియస్

డేవిడ్ వార్నర్‌పై కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం వల్ల క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అప్పటి జట్టు వైస్ కెప్టెన్ వార్నర్, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అలాగే వారిరువురిపై కెప్టెన్సీ బ్యాన్ కూడా చేసింది. ఈ ఘటన జరిగిన రెండేళ్లకు స్మిత్ మీద కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసినప్పటికీ.. వార్నర్‌పై కెప్టెన్సీ పట్ల జీవితకాల నిషేధం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం పాట్ కమిన్స్ టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.. స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక వైట్ బాల్ కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వార్నర్ ఇప్పటికే తనపై విధించిన శిక్షను అనుభవించాడని, అతను మంచి కెప్టెన్ అని, జాతీయ జట్టును కూడా బాగా నడిపించగలడని గ్రెగ్ చాపెల్ తెలిపాడు.

అతన్ని మాత్రమే ఎందుకు భిన్నంగా పరిగణిస్తున్నారు
'బాల్ టాంపరింగ్ వివాదంలో అతను ఓ పాత్రధారుడనే విషయం మనకు తెలుసు. కానీ ఈ వివాదంలో కేవలం అతను మాత్రమే పాల్గొనలేదు. జట్టులోని మిగతా వాళ్లు కూడా ఉన్నారు. కానీ అతన్ని మాత్రమే ఎందుకు భిన్నంగా పరిగణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు' అని చాపెల్ మంగళవారం ఫాక్స్ స్పోర్ట్స్ న్యూస్‌తో తెలిపారు.

ఇప్పటికే చాలా అనుభవించాడు
'అతను ఇప్పటికే చాలా శిక్ష అనుభవించాడు. అతను ఓ మంచి కెప్టెన్ కూడా. అతనికి అవకాశం వస్తే.. సందేహమే లేకుండా.. అతను జట్టుకు చాలా మంచి కెప్టెన్సీ అందించగలడని నేను అనుకుంటున్నాను. అతను తన పెనాల్టీని చెల్లించాడు. కెప్టెన్సీ పాత్ర కోసం ఇక అతనికి విండో తెరవాలి. బాల్ టాంపరింగ్ ఘటన జరిగిన సమయంలో స్టీవ్ స్మిత్, వార్నర్ జట్టు సారథ్య, వైస్ కెప్టెన్సీ బాధ్యతల్లో ఉన్నారు. ఇద్దరూ ఎలైట్ క్రికెట్ నుంచి ఒక సంవత్సరం పాటు నిషేధం ఎదుర్కొన్నారు.' అని చాపెల్ తెలిపాడు.

సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించిన కెప్టెన్‌గా
వార్నర్ గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతని హయాంలో సన్ రైజర్స్ జట్టు ఎన్నో అద్వితీయ విజయాలు కూడా అందుకుంది. వార్నర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ని ఓడించి సన్ రైజర్స్ తొలిసారిగా 2016లో విజేతగా నిలిచింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో డేవిడ్ వార్నర్ 133 వన్డేలు ఆడి 5610పరుగులు చేశాడు. టీ20ల్లో వార్నర్ 91మ్యాచ్‌లు ఆడి 2684పరుగులు చేశాడు. 96టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.53 సగటుతో 7817పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications