హైదరాబాద్: కేరళ క్రికెట్ అసోసియేషన్ నవంబర్ 7 ఆ రాష్ట్ర క్రికెట్ అభిమానులు పండుగ చేసుకునేలా చేసింది. ఎందుకంటే ఆరోజు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది కాబట్టి. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరిస్ ముగిసిన అనంతరం న్యూజిలాండ్ జట్టు నవంబర్ నెలలో భారత పర్యటనకు రానుంది.
ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇండియాతో న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరిస్‌లో భాగంగా జరిగే టీ20 మ్యాచ్‌ల కోసం కొత్తగా రెండు వేదికలను సిద్ధం చేశారు. తిరువనంతపురంలోని స్వాంకీ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం న్యూజిలాండ్‌తో జరిగే రెండో టీ20కి ఆతిథ్యమిస్తోంది.

ఈ స్టేడియం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం కావడం విశేషం. 1998లో వివ్ రిచర్డ్స్ నేతృత్వంలోని వెస్టిండిస్ జట్టు చివరిసారిగా ఈ స్టేడియంలో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. జాతీయ క్రీడలతో పాటు రంజీ మ్యాచ్‌లకు మాత్రం ఆతిథ్యం ఇచ్చింది.
ఇటీవలే కేరళ క్రికెట్ అసోసియేషన్ ఈ స్టేడియాన్ని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంగా పునరుద్ధరించింది. ఈ స్టేడియం కేరళ యూనివర్సిటీకి సంబంధించినది కావడం విశేషం. అంతకముందు వరకు బీసీసీఐ నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు కొచ్చిలోని జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియం అతిథ్యమిచ్చేది.
గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం గురించి తెలుసుకోండి:
Name: Greenfield International Stadium
Where: Kariyavattom, Thiruvananthapuram , Kerala.
Capacity: 65,000
Owned by: University of Kerala
Run by: Kerala Cricket Association
First match: India vs New Zealand T20
When: November 7, 2017
Against New Zealand:
Oct 17: 1st warm-up match at CCI, Mumbai
Oct 19: 2nd Warm-up match at CCI, Mumbai
Oct 22: 1st ODI in Mumbai
Oct 25: 2nd ODI in Pune
Oct 29: 3rd ODI (to be hosted by UPCA)
Nov 1: 1st T20I in Delhi
Nov 4: 2nd T20I in Rajkot
Nov 7: 3rd T20I in Thiruvananthapuram.
All Matches will be broadcast on StarSports.