Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లకు గ్రీన్‌సిగ్నల్.. కానీ?

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరగబోయే మ్యాచ్‌లపై నెలకొన్న సస్పెన్స్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ తెరదించింది. ఒక కొత్త విధానాన్ని ప్రకటించడంతో రాబోయే ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు పాల్గొనడం ఖరారైంది. పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య క్రికెట్ అభిమానులలో నెలకొన్న ఆందోళనలు తొలగిపోయాయి.

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రీడా సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదని, అలాగే పాకిస్తాన్ జట్టును భారతదేశానికి రానివ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఆసియా కప్, ఐసీసీ (ICC) టోర్నమెంట్ల వంటి బహుళజాతి టోర్నమెంట్‌లను వేరుగా పరిగణిస్తారు. ఇవి తటస్థ వేదికలపై జరిగితే, భారత్ వాటిలో పాల్గొనవచ్చు. క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ నిర్ణయంతో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు కేవలం ఆసియా కప్ లేదా ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే జరుగుతాయని తేలిపోయింది.

Green Signal for India vs Pakistan Asia Cup Matches Ministry s New Policy on Bilateral Ties

"పాకిస్తానీ జట్లు లేదా ఆటగాళ్లు పాల్గొనే అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత జట్లు, ఆటగాళ్లు పాల్గొంటారు. అలాగే భారతదేశంలో జరిగే బహుళజాతి టోర్నమెంట్లలో పాకిస్తానీ జట్లు, ఆటగాళ్లను ఆడేందుకు అనుమతి ఇస్తాం" అని ఆ అధికారి వెల్లడించారు.

ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లకు అవకాశం
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మూడు సార్లు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఇది టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది.

Story first published: Thursday, August 21, 2025, 17:23 [IST]
Other articles published on Aug 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+