న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెటర్ల మానసిక సమస్యలపై చర్చ: స్టీవ్ స్మిత్ ఏమన్నాడో తెలుసా?

Great that theres conversation around mental health: Smith

హైదరాబాద్: ఆటగాళ్ల మానసిక సమస్యలపై చర్చించడం మంచిదేనని ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడటం ఇబ్బందేనని అన్నాడు. ఇప్పటికే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, నిక్‌ మ్యాడిన్‌సన్‌ లాంటి క్రికెటర్లు మానసిక సమస్యల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు వారాల వ్యవధిలో ఒకే కారణంతో ముగ్గురు ఆటగాళ్లు మానసిక సమస్యను కారణంగా చూపుతూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

తాజాగా క్రిక్ ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో స్మిత్ మాట్లాడుతూ "ఈ రోజుల్లో షెడ్యూలు తీరికలేకుండా ఉంటోంది. ఎక్కువ సేపు ఆడటం చాలా కష్టం. ప్రత్యేకించి ఫాస్ట్‌బౌలర్లు. వారు చాలా శ్రమించాల్సి వస్తుంది. మానసిక సమస్యలపై చర్చ జరుగుతుండటం మంచిదే. సాధ్యమైనంత వరకు మేం ఆటగాళ్లను శారీరకంగా, మానసికంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆసీస్‌ డ్రస్సింగ్‌ రూమ్‌లో క్రికెటర్ల పనిభారం, అలసట, ఒత్తిడిని సమీక్షిస్తున్నాం. రోజంతా క్రికెటర్లకు ఎలా గడిచింది? నిద్రపోయే విషయం? వంటి వివరాలు తెలుసుకుంటున్నారు" అని స్మిత్ అన్నాడు.

India vs Bangladesh: ఇండోర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయంIndia vs Bangladesh: ఇండోర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం

కోచ్‌, సైకాలజిస్టు

కోచ్‌, సైకాలజిస్టు

"కోచ్‌, సైకాలజిస్టు రోజువారీ మా వివరాలను సమీక్షిస్తారు. ప్రవర్తనలో మార్పు గమనిస్తే, అస్వస్థతగా అనిపిస్తే, బాగా నిద్రపోకుంటే వెంటనే మాతో సంభాషిస్తారు. ఎందుకు నిద్ర పట్టలేదు? ఏం జరుగుతోంది? ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుంటారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు" అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.

మానసిక సమస్యల కారణంగా

మానసిక సమస్యల కారణంగా

ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నిక్‌ మ్యాడిసన్‌, విల్‌ పుకోవ్‌స్కీ మానసిక సమస్యల కారణంగా క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టులో చోటు ఖాయమనుకున్న సమయంలో విల్‌ పుకౌస్వి తనకు తానుగా తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సెలక్షన్‌లో అతని పేరు పరిశీలనలో ఉండగా

సెలక్షన్‌లో అతని పేరు పరిశీలనలో ఉండగా

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు సెలక్షన్‌లో అతని పేరు పరిశీలనలో ఉండగా ఈ సిరిస్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు డబుల్‌ సెంచరీ సాధించిన విల్‌ పుకౌస్విను పాక్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టులోకి తీసుకోవాలని సీఏ భావించింది.

మానసిక సమస్యలు

మానసిక సమస్యలు

అయితే తనకు మానసిక సమస్యలు ఉన్నాయంటూ అతను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు విన్నవించడం విశేషం. అతడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా విల్‌ పేరును పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది. మానసికంగా ఇబ్బంది పడుతున్న కారణంగానే తాను తప్పుకుంటున్నట్లు పేర్కొన్నట్లు సీఏ తెలిపింది.

Story first published: Tuesday, November 19, 2019, 7:50 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X