Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shane Warne: దిగ్గజ స్పిన్నర్ గౌరవార్థం మెల్‌బోర్న్ స్టాండ్ పేరును షేన్ వార్న్ స్టాండ్‌గా మార్పు

Great Southern Stand in Melbourne will be renamed the Shane Warne Stand in honor of Shane Warne

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని ప్ర‌ముఖ క్రికెట్ స్టేడియం మెల్‌బోర్న్‌లోని గ్రేట్ సదరన్ స్టాండ్ పేరును షేన్ వార్న్‌ స్టాండ్‌గా మార్చనున్నట్లు విక్టోరియా క్రీడా మంత్రి మార్టిన్ పాకుల అధికారికంగా ప్ర‌క‌టించారు. షేన్ వార్న్‌ గౌరవార్థం వీలైనంత త్వరగా ఆయ‌న పేరును పెడ‌తామ‌ని తెలిపారు. ఇది షేన్ వార్న్ జ్ఞాప‌కార్థంగా నిలిచిపోనుంది. కాగా షేన్ వార్న్ స్వ‌స్థలం ఆస్ట్రేలియాలోని విక్టోరియానే. అత‌ని హోం గ్రౌండ్ మెల్‌బోర్న్‌. 1969 సెప్టెంబ‌ర్ 13న షేన్ వార్న్‌ విక్టోరియాలో జ‌న్మించారు.

కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ శనివారం గుండె పోటుతో మరణించాడు. ఈ విషయాన్ని ఆయన మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. థాయ్‌లాండ్‌లో ఉన్న 52 ఏళ్ల షేన్ వార్న్ అతని విల్లాలో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించామని, వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని మేనేజ్‌మెంట్ తెలిపింది.

మ‌రోవైపు ఇండియా, శ్రీ‌లంక తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు శుక్ర‌వారం మృతి చెందిన దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేన్ వార్న్ మృతి ప‌ట్ల ఇరు జ‌ట్ల ఆట‌గాళ్ల‌తోపాటు స‌పోర్టింగ్ స్టాఫ్ సంతాపం పాటించారు. షేన్‌వార్న్‌కు మృతికి సంతాపంగా ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అనంత‌రం మ్యాచ్ ప్రారంభించారు. అలాగే ఆట‌గాళ్లంతా చేతుల‌కు న‌ల్ల బ్యాడ్జ్‌ల‌ను ధ‌రించి మ్యాచ్ ఆడుతున్నారు.

భార‌త ఆట‌గాళ్లు స‌చిన్ టెండూల్క‌ర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, సౌర‌వ్ గంగూలీ, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ త‌దిత‌రులు షేన్ వార్న్ మృతికి సంతాపం తెలిపారు. 15 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్లో షేన్ వార్న్ ఎన్నో మైలు రాళ్ల‌ను సాధించారు. త‌న లెగ్ స్పిన్‌తో బ్యాట‌ర్ల‌ను ముప్ప తిప్పలు పెట్టారు. స్పిన్ బౌలింగ్ అంటే షేన్ వార్నే అనేంత‌గా క్రికెట్‌ను ఎలారు. కెరీర్లో 145 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశాడు. ఇక 194 వ‌న్డే మ్యాచ్‌ల్లో 293 వికెట్లు తీశాడు. 55 టీ20 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి వెయ్యి వికెట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన వార్న్ తొలి సీజ‌న్‌లోనే ఆ జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిల‌బెట్టాడు.

షేన్ వార్న్ కెరీర్లో గొప్పి ఇన్నింగ్స్‌ల్లో 1999 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్స్ , ఫైనల్‌లో బ్యాక్-టు-బ్యాక్ ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డులు ఉన్నాయి. అలాగే ఇంగ్లండ్‌పై ఐదు యాషెస్ సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు.

Story first published: Saturday, March 5, 2022, 11:02 [IST]
Other articles published on Mar 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+