టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన కపిల్ మైనపు విగ్రహం ఇదే
హైదరాబాద్: ఇండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. కన్నాట్ ప్లేస్‌లోని రీగల్ సినిమా సమీపంలో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు విగ్రహాన్ని ఉంచారు.
గురువారం జరిగిన వేడుకలో కపిల్ దేవ్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1983లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కపిల్ దేన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ అనుభూతిని నేనెప్పటికీ మరిచిపోను
‘మహామహుల సరసన నా విగ్రహం పెట్టడం గర్వకారణం. ఈ అనుభూతిని నేనెప్పటికీ మరిచిపోను. నా జీవితమంతా క్రికెట్‌నే ప్రాణంగా శ్వాసించాను. ప్రతి క్రికెటర్ విజయవంతం కావాలని నేనిప్పుడు కోరుకుంటున్నా' అని కపిల్ చెప్పారు.

నా అభిమానులకు కృతజ్ఞతలు
'58 ఏళ్ల వయసులో నా మైనపు విగ్రహం పెట్టడం నాకు గౌరవం. ఇది నాకు మరింత ప్రేరణ కలిగిస్తుంది. నన్ను మేడమ్ టుస్సాడ్స్ దాకా తీసుకొచ్చిన నా అభిమానులకు కృతజ్ఞతలు. 300 రకాల కొలతలు తీసుకోవడం చాలా బాగా అనిపించింది' అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.

టుస్సాడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 23 శాఖలు
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్నాయి. టుస్సాడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 23 శాఖలు ఉన్నాయి. ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియం 23వది కావడం విశేషం.

50కి పైగా మైనపు విగ్రహాలు
క్రీడా, మ్యూజిక్, ఫిల్మ్, టీవీ సెలబ్రిటీలు ఇందులో ఉన్నారు. మహత్మా గాంధీ, సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, జాకీ చాన్, లేడీ గాగా ఇలా సుమారు 50 మైనపు విగ్రహాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications