Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు.. క్యాచ్ పట్టిన ఆనందంలో..!

Grame Swann Celebrations after He received a fantastic Catch in stands

ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఇంక తన క్రికెట్ పిచ్చిని ఏమాత్రం తగ్గించుకోలేదు. ఓ మ్యాచ్ టైంలో ప్రేక్షకుల ప్లేస్‌లో నిల్చున్న స్వాన్ ఓ బ్యాటర్ కొట్టిన సిక్స్‌ను అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఇక క్యాచ్ అందుకున్నాక అతని ఆనందం అంతా ఇంతా కాదు.. ఏకబిగిన పరుగులు పెడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ అవుతుంది. ఈ సంఘటన టీ10యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగింది. ఈ ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఇటలీ వర్సెస్ స్విట్జర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే టైంలో ఇటలీ బ్యాటర్ చక్కా బాదాడు.

అదే టైంలో బౌండరీల అవతల ఉన్న స్వాన్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఇటలీ గెలుపొందింది. తొలుత ఇటలీ నిర్ణీత 10ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 168పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన స్విట్జర్లాండ్ 7వికెట్లు కోల్పోయి కేవలం 102పరుగులు మాత్రమే చేసి 66పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయింది. యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో గ్రూప్ డీలో ఇటలీ, స్విట్జర్లాండ్ ప్రస్తుతం టాప్‌లో ఉన్నాయి.

గ్రేమ్ స్వాన్ 2013లోనే ఇంటర్నేషలన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా తనదైన విశ్లేషణలతో ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు 60 టెస్టులు, 79 వన్డేలు, 39 టీ20లలో స్వాన్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక స్వతాహాగా స్పిన్నర్ అయిన స్వాన్ ఆ మధ్య తానే గనుక టీమిండియా జట్టు సెలక్టర్‌ అయి ఉంటే.. భారత టెస్ట్ జట్టులో వెంటనే యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేసి ఉండేవాడినంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చాహల్ ప్రపంచ స్థాయి బౌలర్ అని స్వాన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని కూడా పేర్కొన్నాడు. చాహల్ టీ20, వన్డే ఫార్మాట్లకు సరిపోయినట్లు టెస్టులకు సరిపోతాడో లేడో కచ్చితంగా చెప్పలేనని స్వాన్ పేర్కొన్నాడు. ఆధునిక స్పిన్నర్లు ఫింగర్స్, శరీరం, మైండ్‌తో అధిక శ్రమ పడాల్సిన అవసరం టెస్టుల్లో ఉంటుందని అందువల్ల అంతగా ఆకర్షితులు కావడం లేదని అతను పేర్కొన్నాడు.

Story first published: Saturday, October 8, 2022, 10:02 [IST]
Other articles published on Oct 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+