For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రవిడ్‌కు బౌలింగ్ చేస్తుంటే.. ప్రావిణ్యం లేని 11 ఏళ్ల బాలుడిలా మారా: మాజీ స్పిన్నర్‌

Graeme Swann says Rahul Dravid made me feel like an 11-year-old spinner

లండన్: భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌పై ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే ద్రవిడ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని కొనియాడాడు. అతడికి బౌలింగ్‌ చేస్తుంటే.. బౌలింగ్‌లో ప్రావిణ్యం లేని 11 ఏళ్ల బాలుడిలా అనిపించిందని అన్నాడు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రేమ్‌ స్వాన్‌ తన అనుభవాలు పంచుకున్నాడు.

ద్రవిడ్​ కంటే అత్యుత్తమ ఆటగాడిని చూడలేదు:

ద్రవిడ్​ కంటే అత్యుత్తమ ఆటగాడిని చూడలేదు:

'టెస్టుల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే ఓ బ్యాట్స్‌మన్‌కు కౌంటీ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయడం కంటే టెస్టుల్లోనే సులభం. నా వరకు రాహుల్ ద్రవిడ్ అందరి కంటే గొప్ప బ్యాట్స్​మన్​. కౌంటీల్లో అతడికి నేను బౌలింగ్ చేశా. అసాధారణంగా ఆడాడు. అతడి కంటే అత్యుత్తమ బ్యాట్స్​మన్​ను నేను నా జీవితంలో చూడలేదు. ఓ కౌంటీ గేమ్​లో అతడు అసలు ఔటే కాలేదు. అతడు బంతులు ఎదుర్కొన్న తీరు, సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం అమోఘం. రాహుల్ ద్రవిడ్ అంటే అదే. అతడు బ్యాటింగ్ చేస్తుంటే నేను 11 ఏళ్ల స్పిన్నర్​లా ఫీలయ్యా' అని స్వాన్ చెప్పాడు.

అది గొప్ప బంతి మాత్రం కాదు:

అది గొప్ప బంతి మాత్రం కాదు:

2008లో చెన్నైలో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన గ్రేమ్‌ స్వాన్.. తొలి ఓవర్లోనే గౌతమ్ గంభీర్​తో పాటు రాహుల్ ద్రవిడ్​ను కూడా ఔట్ చేశాడు. ఆ జ్ఞాపకాన్ని కూడా స్వాన్ గుర్తు చేసుకున్నాడు. అది అద్భుతమైన బంతి అని, అయితే సాధారణంగా ద్రవిడ్​ను ఔట్ చేయగలిగినంత గొప్పది మాత్రం కాదని గ్రేమ్​ స్వాన్ అన్నాడు. కష్టాల్లో ఉన్న భారత జట్టును ద్రవిడ్ ఎన్నోసార్లు ఆడుకున్నాడన్నాడు. స్వాన్‌ 60 టెస్ట్ మ్యాచ్‌లలో 255 వికెట్లు పడగొట్టాడు. 79 వన్డేలలో 104 వికెట్లు తీసాడు. ఇక 39 టీ20లలో 51 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

163 టెస్టులు.. 13,265 పరుగులు:

163 టెస్టులు.. 13,265 పరుగులు:

తన కెరీర్​లో 163 టెస్టులు ఆడిన రాహుల్​ ద్రవిడ్​.. 52 కుపైగా బ్యాటింగ్ సగటుతో 13,265 పరుగులు చేశాడు. మొత్తంగా 31,184బంతులను ఎదుర్కొన్నాడు. ఎన్నోసార్లు ఆపదలో ఉన్న భారత జట్టును ఆదుకొని, పరాజయాలను తప్పించి 'ది వాల్​' పేరును దక్కించుకున్నాడు. 344 వన్డేలలో 10889 రన్స్ చేసాడు. ఇక ఒక టీ20లో 31 పరుగులు బాదాడు.

పీటర్సన్‌కు, నాకు పడేది కాదు:

పీటర్సన్‌కు, నాకు పడేది కాదు:

గ్రేమ్‌ స్వాన్‌ ఇటీవల 'ఇన్ ది పింక్' ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'జట్టులో కెవిన్ పీటర్సన్​ ఉండాలని నేను కోరుకునే వాడిని. ఎందుకంటే.. అతడు భారీ స్కోర్లు చేసేవాడు. బాగా ఆడేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్​మెన్​లో అతడు ఒకడు. మేము ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన జట్టులోని సభ్యులమైనా.. 90 శాతం విడివిడిగా ఉండేవాళ్లం. ఒకే జట్టులో ఉన్నా పీటర్సన్‌కు, నాకు పరస్పరం ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఎందుకో కేపీ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అలానే పీటర్సన్‌ కూడా నాతొ సఖ్యతగా ఉండేవాడు కాదు. ఇద్దరి మధ్య విభేదాలుండేవనే విషయం క్రికెట్‌ ప్రేమికులందరికీ తెలుసు' అని తెలిపాడు.

Story first published: Saturday, April 18, 2020, 15:41 [IST]
Other articles published on Apr 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+