గ్రేమ్ స్వాన్ సంచలన వ్యాఖ్యలు.. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు!!

లండన్: ఇంగ్లండ్ క్రికెట్‌లో మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ దిగ్గజ ఆటగాడైతే.. గ్రేమ్ స్వాన్ కీలక స్పిన్నర్‌గా చాలాకాలం పాటు కొనసాగాడు. అయితే తామిద్దరం కలిసి క్రికెట్ ఆడిన సందర్భాల్లో ఒకరంటే ఒకరి ఇష్టం ఉండేది కాదని, తమ మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి స్నేహపూర్వక వాతావరణం ఉండేది కాదని గ్రేమ్ స్వాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒకే జట్టులో ఉన్నా పరస్పరం ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేదన్నాడు. అయితే జట్టుగా మైదానంలో ఆడే సమయంలో మాత్రం ఐకమత్యంతో ఉండేవారమని చెప్పాడు.

జట్టులో ఉండాలని కోరుకునే వాడిని:
గ్రేమ్ స్వాన్ శుక్రవారం 'ఇన్ ది పింక్' ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'జట్టులో పీటర్సన్ ఉండాలని నేను కోరుకునే వాడిని. ఎందుకంటే.. అతడు భారీ స్కోర్లు చేసేవాడు. బాగా ఆడేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో అతడు ఒకడు. మేము ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన జట్టులోని సభ్యులమైనా.. 90 శాతం విడివిడిగా ఉండేవాళ్లం' అని తెలిపాడు.

ఒకరంటే ఒకరికి పడేది కాదు:
'ఒకే జట్టులో ఉన్నా పీటర్సన్‌కు, నాకు పరస్పరం ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఎందుకో కేపీ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అలానే పీటర్సన్ కూడా నాతొ సఖ్యతగా ఉండేవాడు కాదు. ఇద్దరి మధ్య విభేదాలుండేవనే విషయం క్రికెట్ ప్రేమికులందరికీ తెలుసు. సాధారణంగానూ, కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ నిబంధనలను పీటర్సన్ అంతగా ఇష్టపడకపోయే వాడు' అని గ్రేమ్ స్వాన్ పేర్కొన్నాడు. స్వాన్ 60 టెస్ట్ మ్యాచ్‌లలో 255 వికెట్లు పడగొట్టాడు.

3 టెస్టులు, 10 వన్డేలకు నాయకత్వం:
2013-14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. 2012లో అప్పటి కెప్టెన్ ఆండ్రు స్ట్రాస్, కోచ్ ఆండీ ఫ్లవర్‌ను విమర్శిస్తూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పీటర్సన్ సందేశాలు పంపాడన్న ఆరోపణలు అతడిపై వేటు వేసేందుకు మరో కారణం. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు టెస్టులు, 10 వన్డేలలో జట్టుకు నాయకత్వం వహించాడు.

104 టెస్టులు.. 136 వన్డేలు:
దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా.. 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక లాక్‌డౌన్ సందర్భంగా పలువురు ఆటగాళ్లను కేపీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications