Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్‌లో ఐపీఎల్ జట్ల హవా..! తొలి సీజన్‌కు కమిషనర్‌గా గ్రేమ్ స్మిత్, వివరాలివే..!

Graeme Smith Elected As Commission For New T20 League In Southafrica

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అయిన క్రికెట్ సౌతాఫ్రికా ఐపీఎల్ తరహాలో ఆరు జట్లతో కూడిన ఫ్రాంచైజీ ఆధారిత టీ20లీగ్‌ తొలి ఎడిషన్‌ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీ20 టోర్నీకి సంబంధించి మరో అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఈ టీ20 లీగ్ కమిషనర్‌గా సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌ను నియమిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా అఫిషియల్ ప్రకటన చేసింది. తద్వారా తొలి సీజన్‌కు కమిషనర్‌గా స్మిత్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. ఇకపోతే షెడ్యూల్, ప్లేయర్ల బిడ్డింగ్ త్వరలోనే జరగబోతుంది. ఇకపోతే ఆరు జట్ల ఫ్రాంఛైజీలను ఐపీఎల్ జట్లు దక్కించుకుని హవా చూపాయి.

సౌతాఫ్రికా టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి..

సౌతాఫ్రికా టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి..

ఈ నిర్ణయం అనంతరం గ్రేమ్ స్మిత్ స్పందిస్తూ.. ఈ ఉత్తేజకరమైన కొత్త వెంచర్‌‌ను లీడ్ చేసే బాధ్యతను నాకు అప్పగించడాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. దక్షిణాఫ్రికా క్రికెట్‌‌ ప్రగతికి నేను గాఢంగా కట్టుబడి ఉన్నాను. నా వరకు నేను ఈ టోర్నీని ఉత్తమంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తా. ఇది చాలా కంపిటేటివ్ టోర్నీగా నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను. అలాగే పెట్టుబడులతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లకు కొత్త అవకాశాలను ఈ టోర్నీ అందించగలదని, ముఖ్యంగా సౌతాఫ్రికాలోని టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగుచూస్తారని' స్మిత్ మీడియాతో తెలిపాడు.

ఏ టీంను ఏ ఐపీఎల్ జట్టు కొన్నదంటే..?

ఏ టీంను ఏ ఐపీఎల్ జట్టు కొన్నదంటే..?

వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలలో టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఏకంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను కూడా దక్షిణాఫ్రికా బోర్డు రద్దు చేసుకోవడం తెలిసిందే. ఇక ఈ టోర్నీల్లో పాల్గొనే ఆరు ఫ్రాంఛైజీలను ఐపీఎల్లో ఆడే ఫ్రాంచైజీలు కొనేయడం గమనార్హం. ఇక నగరాల పేర్లతో టీంలను విభజించారు. ఇక ఏ టీంను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కించుకుందో ఓసారి పరిశీలిస్తే

కే‌ప్‌టౌన్ జట్టు - ముంబై ఇండియన్స్

జోహన్నెస్ బర్గ్ టీం - చెన్నై సూపర్ కింగ్స్

డర్బన్ జట్టు - లక్నో సూపర్ జెయింట్స్

పోర్ట్ ఎలిజబెత్ జట్టు - సన్ రైజర్స్ హైదరాబాద్

ప్రిటోరియా జట్టు - ఢిల్లీ క్యాపిటల్స్

పారల్ జట్టు - రాజస్థాన్ రాయల్స్

టోర్నీ ఎలా సాగుతుందంటే..?

టోర్నీ ఎలా సాగుతుందంటే..?

ఈ లీగ్‌‌లో ఆరు జట్లు ప్రతి ఒక్క జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. లీగ్ మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్ దశకు చేరుకుంటాయి. మూడు జట్లు మళ్లీ ప్రతి జట్టుతో ఒక మ్యాచ్ ఆడతాయి. మూడింట్లో టాప్ ప్లేస్‌లో ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి. ఫైనల్లో గెలిచిన జట్టు టోర్నీ విజేతగా నిలుస్తుంది. ఇక ఈ కొత్త టీ20 లీగ్‌లో మొత్తం 33మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ 3లేదా 4వారాలు కొనసాగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే.. ఈ టోర్నమెంట్‌లో ప్రతి జట్టు ప్లేయింగ్ XIలో గరిష్ఠంగా నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఆడించొచ్చు. అలాగే ప్లేయర్లను వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయి.

Story first published: Tuesday, July 19, 2022, 18:30 [IST]
Other articles published on Jul 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+