కొలంబో: తాను శ్రీలంకలో ఉన్న సమయంలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నానని, అలాగే కోహ్లీని కలిసే అవకాశం దక్కాలని ఆశిస్తున్నానని శ్రీలంక పర్యటనలో ఉన్న జింబాబ్వే సారథి గ్రేమ్ క్రీమర్ అన్నాడు.
కోహ్లీని కలిసి అతనితో మాట్లాడి విలువైన సలహాలు, సూచనలు పొందాలనుకుంటున్నానని అతను తెలిపాడు.

బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించేందుకు, స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అతని నుంచి మెలకువలు తెలుసుకుంటానని చెప్పాడు.
కాగా, శ్రీలంక - జింబాబ్వే మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ ముగిసింది. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2తో జింబాబ్వే దక్కించుకుంది. ఏకైక టెస్టులో శ్రీలంక గెలిచింది. కోహ్లీ సేన కూడా త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్తుంది.