Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో గ్లామర్ తళుకులు: స్టార్ క్రికెటర్ కూతురు సంచలనం

Delhi Premier League 2025: ఢిల్లీ ప్రీమియర్ లీగ్(DPL) 2025లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ కూతురు గ్రేస్ హేడెన్ తన స్టైలిష్ లుక్, అందమైన యాంకరింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రేస్ హేడెన్ యాంకరింగ్ ప్రస్తుతం ఈ లీగ్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడుతున్న అంశాలలో ఒకటిగా నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో స్టార్ స్పోర్ట్స్‌తో కామెంటరీ చేసినప్పుడే గ్రేస్ హేడెన్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఈ అతిపెద్ద టీ20 లీగ్‌లో కూడా ఆమె తన గ్లామర్, ఫ్యాషన్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. క్రికెట్ ప్రపంచంలో తండ్రి సాధించిన విజయాలను మైదానం బయట కొనసాగిస్తున్నట్లుగా ఆమె ప్రదర్శన ఉంది.

Grace Hayden Shines in DPL 2025 Glamour Style and Stardom in Delhi Premier League

సోషల్ మీడియాలో సంచలనం
గ్రేస్ హేడెన్ వ్యక్తిగత జీవితం, ఆమె లైఫ్ స్టైల్‌పై అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఇటలీలో సెలవులకు వెళ్లినప్పుడు దిగిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఒక క్రికెట్ ప్రజెంటర్‌గా తన లైఫ్‌స్టైల్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో ఆమె స్నేహం కూడా చర్చనీయాంశమైంది. ఇద్దరూ కలిసి కారులో తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి మరింత ఆసక్తి పెరిగింది.

Grace Hayden Shines in DPL 2025 Glamour Style and Stardom in Delhi Premier League

తన బాయ్‌ఫ్రెండ్ విల్సన్ స్టాథమ్‌తో కలిసి గడిపిన సెలవుల ఫోటోలు కూడా క్రికెట్ వర్గాలతో పాటు సెలబ్రిటీ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఐపీఎల్ సమయంలో గ్రేస్ హేడెన్ చూపించిన చొరవ, ఆకర్షణ వల్ల, ఆ సంవత్సరానికి ఆమె ఎక్కువగా సెర్చ్ చేయబడిన మహిళా క్రికెట్ యాంకర్లలో ఒకరిగా నిలిచిందియ ఆమె అందంతో పాటు, క్రికెట్ గేమ్ పట్ల ఆమెకున్న పట్టు, మ్యాచ్‌లను విశ్లేషించే విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రేస్ హేడెన్ తన స్టైలిష్ దుస్తులతో, గ్లామరస్ ప్రెజెంటేషన్‌తో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒక కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. 2025లో అత్యంత ట్రెండింగ్ క్రికెట్ ప్రజెంటర్లలో ఆమె ఒకరిగా నిలబడింది.

Story first published: Sunday, August 31, 2025, 14:34 [IST]
Other articles published on Aug 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+