Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫాస్టెస్ట్ సెంచరీ: 42 బంతుల్లో సెంచరీతో సరికొత్త రికార్డు (వీడియో)

Grace Harris hits 42-ball century in womens Big Bash League

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌గా బ్రిస్బేన్ హీట్ జట్టు ఓపెనర్ గ్రేస్ హార్రిస్ అరుదైన ఘనత సాధించింది.

టోర్నీలో భాగంగా బుధవారం గబ్బా వేదికగా మెల్ బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు ఓపెనర్ గ్రేస్ హార్రిస్ 42 బంతుల్లో 5 సిక్సులు, 10 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించింది. హార్రిస్ సెంచరీతో మెల్ బోర్న్ స్టార్స్‌పై బ్రిస్బేన్ హీట్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

గ్రేస్ హార్రిస్ 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు బ్రిస్బేన్ హీట్ జట్టు విజయానికి ఒక పరుగు అవసరమైంది. ఈ సమయంలో హార్రిస్ సిక్స్ బాది అటు సెంచరీతో పాటు ఇటు జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో మహిళల బిగ్ బాష్ లీగ్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.

కాగా, గత బిగ్ బాష్ లీగ్‌ సీజన్‌లో ఆష్లే గార్డెనర్ 47 బంతుల్లో సాధించిన సెంచరీనే ఇప్పటివరకు అత్యంత వేగంగా సాధించినది కావడం విశేషం. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో వెస్టిండిస్‌కు చెందిన డీండ్రా డోటిన్ పేరిట ఈ రికార్డు నమోదైంది. డోటిన్ కేవలం 38 బంతుల్లో సెంచరీ నమోదు చేయడం విశేషం.

2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డీండ్రా డోటిన్ ఈ రికార్డు నమోదు చేసింది.

Story first published: Thursday, December 20, 2018, 17:17 [IST]
Other articles published on Dec 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+