తొలిసారి నా భార్య మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వస్తే డకౌట్ అయ్యా: సచిన్

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్.... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న క్రికెట్ దేవుడు. ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, సచిన్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
తాజాగా గౌరవ్ కపూర్ నిర్వహించే వెబ్ సిరిస్ 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే కార్యక్రమానికి హాజరైన సచిన్ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. కుటుంబ సభ్యులను చూస్తూ తాను ఆట మీద సరిగ్గా దృష్టి పెట్టలేనని అందుకే వారిని మ్యాచ్ చూడటానికి రమ్మని ఆహ్వానించనని పేర్కొన్నారు.

స్టేడియానికి వస్తే కనిపించకుండా ఉండమని చెప్తా
ఒక వేళ వారు వచ్చిన తనకు కనిపించకుండా ఉండమని చెప్తానని సచిన్ తెలిపారు. 2003-04లో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌ను చూడటానికి తన భార్య అంజలి వచ్చిందని, ఆ సమయంలో తాను మొదటి బంతికే అవుటయ్యానని తెలిపారు. దీంతో అంజలి వెంటనే స్టేడియం నుంచి వెళ్లి పోయిందని సచిన్ చెప్పుకొచ్చారు.

మైదానంలో ఏకాగ్రతతో ఉంటాను
`మైదానంలో బ్యాటింగ్‌కు వెళ్లినపుడు చాలా ఏకాగ్రతతో ఉంటాను. అయితే నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో నా కుటుంబ సభ్యులు ఉంటే ఆట మీద పూర్తిగా దృష్టి పెట్టలేను. అందుకే వారిని ఎప్పుడూ స్టేడియానికి రమ్మని ఆహ్వానించలేదు' అని సచిన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.

తొలి బంతికే ఔటయ్యా
'2004లో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు అంజలి మైదానానికి వచ్చింది. ఆ మ్యాచ్‌లో నేను తొలి బంతికే ఔటయ్యా. ఆమె వెంటనే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె స్టేడియాలకు రావడం మానేసింది. మళ్లీ నా చివరి మ్యాచ్ చూడడానికే వచ్చింది' అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.

ఆ క్షణంలో చాలా భావోద్వేగానికి గురయ్యా
అలానే వెస్టిండీస్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా సచిన్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌ను చూడడానికి తొలిసారి తన అమ్మగారు స్టేడియానికి వచ్చారని సచిన్ తెలిపాడు. ఆ సమయంలో ధోని తనను హడిల్ నుంచి దూరంగా ఉండమని కోరాడని, తనకు వీడ్కోలు ఇవ్వడానికి వారు ఏదో ప్లాన్ చేస్తున్నారనే విషయం తనకు అర్థమైందన్నారు. ఆ క్షణంలో తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని సచిన్ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications