For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ సక్సెస్ సీక్రెట్స్ ఆ రెండే: విండీస్ దిగ్గజ ఓపెనర్ గోర్డన్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ మాజీ ఓపెనింగ్ దిగ్గజం గోర్డన్ గ్రీనిడ్జ్ భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విశ్వాసం, తనపై తనకు ఉన్న నమ్మకం.. ఇవే కోహ్లీని ప్రపంచ ఉత్తమ బ్యాట్‌మన్లలో ఒకరిగా నిలబెడుతున్నాయని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు రాణించడానికి ఇవి రెండు ఎంతో దోహదం చేస్తున్నాయని తెలిపాడు.

క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 27ఏళ్ల విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫాంను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆగస్టు 22తో వెస్టిండీస్ జట్టుతో ఆడుతున్న 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ముగియనుంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా చివరి మ్యాచ్ జరిగే అకాశం లేకుండా పోయింది. దీంతో సోమవారం ఈ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించే అవకాశం ఉంది.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బిసిసిఐ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 65ఏళ్ల గ్రీనిడ్జ్ పలు విషయాలను వెల్లడించారు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించడంపై స్పందిస్తూ.. అతని ఆత్మ విశ్వాసమే అని విజయాలకు కారణమని తెలిపాడు. ఆత్మ విశ్వాసం ఉన్న ఏ ఆటగాడైనా విరాట్ కోహ్లీలా రాణిస్తాడని చెప్పాడు.

 Gordon Greenidge to Virat Kohli: Never stop believing in yourself

తమపై తమకు నమ్మకం లేకే చాలా మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు కోహ్లీలా రాణించలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. తనను తాను విశ్వాసిస్తాడు గనుకనే కోహ్లీని ఏ బౌలర్ కూడా అడ్డుకోలేకపోతున్నారని చెప్పాడు. అతనొక మంచి ఆటగాడని, అతనికి మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేగాక, కోహ్లీ ఆకర్షణీయంగా ఉంటాడని, అందుకే చాలా మంది అతడ్ని చూడటానికి ఇష్టపడతారని తెలిపాడు.

కాగా, 108 టెస్టులాడిన గ్రీనిడ్జ్..7,558 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా, టెస్ట్ సిరీస్ అనంతరం విండీస్‌తో టీమిండియా 2 టీ20 మ్యాచ్ లను ఆడనుంది. ఈ టీ20 మ్యాచ్‌లు ఆగస్టు 27, 28లలో అమెరికాలో జరగనున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+