Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి, రోహిత్ కాదు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్‌కు అందలం: గూగులమ్మ నివేదిక!

మరో కొన్ని రోజుల్లో 2024 పూర్తికానుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా క్రీడల్లో ఎన్నో స్మృతులు. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది ఏఏ వ్యక్తుల గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారనే నివేదికను గూగుల్ వెల్లడించింది. ఈ నివేదికలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అగ్రస్థానంలో నిలిచింది. మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన ఈమె రాజకీయాల్లోకి ప్రవేశించింది.

పారిస్ ఒలింపిక్స్‌లో కొద్దిలో వినేశ్ ఫొగాట్ పతకం చేజార్చుకుంది. రెజ్లింగ్‌ 50 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆమె ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు అదనంగా ఉందని అనర్హత వేటుకు గురైంది. ఇక రెండో స్థానంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నారు. మూడో స్థానంలో లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, నాలుగో స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, అయిదో స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు.

Google s Year in Search 2024 Hardik Pandya and Shashank Singh Among Top Trending Sports Personalities

అయితే ఆరో స్థానంలో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్ ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో పూనం పాండే (మోడల్), రాధిక మర్చంట్ (వ్యాపారవేత్త), అభిషేక్ శర్మ (క్రికెటర్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్ ) ఉన్నారు. కాగా, రూ.5.5 కోట్లకు రిటైన్ చేసుకున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్ శశాంక్ కోసం ప్రపంచ వ్యాప్తంగానూ సెర్చ్ చేయడం విశేషం. గూగుల్ టాప్-10 అథ్లెట్ల సెర్చ్ జాబితాలో అల్జీరియా బాక్సర్ ఇమానే ఖలీఫ్ ఉంది. పారిస్‌ ఒలింపిక్స్‌‌‌లో ఇమానే ఖలీఫ్‌కు పురుష లక్షణాలున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక టాప్-10లో క్రికెటర్లు హార్దిక్ పాండ్య, శశాంక్ సింగ్ ఉన్నారు. హార్దిక్ ఏడో స్థానంలో, శశాంక్ తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మంచి శశాంక్ కోసం అత్యధికంగా సెర్చ్ చేయడం విశేషం. కాగా, టాప్-10 అథ్లెట్లలో ఇమానే ఖలీఫ్, మైక్ టైసన్, లామిన్ యమల్, సిమోన్ బైల్స్, జేక్ పాల్, నికో విలియమ్స్, హార్దిక్ పాండ్య, స్కాటీ షెఫ్లర్, శశాంక్ సింగ్, రోడ్రి నిలిచారు.

Story first published: Wednesday, December 11, 2024, 17:08 [IST]
Other articles published on Dec 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+