For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ స్పెషల్: ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింన గూగుల్ (వీడియో)

Google Doodle Celebrates The Beginning of Cricket World Cup 2019

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే ఇంగ్లాండ్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ఓ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. 'Google'లోని అక్షరాల్లో 'O' అక్షరాన్ని బంతితో 'L' అక్షరాన్ని వికెట్స్‌తో, మధ్యలోంచి బౌలర్‌ బంతి వేస్తున్నట్లుగా డూడుల్‌ను రూపొందించింది. ప్రముఖుల పుట్టినరోజు, పండుగ సందర్భాల్లో గూగుల్ ఇలా డూడుల్‌ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999).

జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.

1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

Story first published: Thursday, May 30, 2019, 11:37 [IST]
Other articles published on May 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+