ఈరోజు ప్రత్యేకత ఇదే: తొలి టెస్టు జరిగి 140 సంవత్సరాలు
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు బుధవారం ఎంతో ప్రత్యేకమైన రోజు. తొలి టెస్టు జరిగి ఈరోజుతో 140 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఫీల్డర్లు కనిపిస్తారు.
బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ఫీల్డర్లు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ ఈ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. తొలి టెస్టు 1877 మార్చి 15నుంచి 19 వరకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా 45పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది.
తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్
తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌ను ఆస్ట్రేలియా చేసింది. ఆల్ప్రెడ్ షా వేసిన తొలి బంతిని చార్లెస్ బెన్నర్మాన్ ఎదుర్కొన్నాడు. ఈ టెస్టులో చార్లెస్ బెన్నర్మాన్ 165 పరుగులతో సెంచరీని నమోదు చేసిన కుడి చేతి వేలుకి గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత 1977లో ఆస్ట్రేలియాలో వందేళ్ల పండుగని నిర్వహించారు.
45 పరుగుల తేడాతో విజయం
అంతేకాదు తొలి టెస్టు జరిగి వందేళ్లు అయిన సందర్భంగా 1977 మార్చి 12న మెల్‌బోర్న్‌లోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ నిర్వహించారు. విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్‌లో కూడా 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఐసీసీ టెస్టుల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది.

టెస్టుల్లో ఎన్నో మార్పులు
2012లో డే అండ్ నైట్ టెస్టులను నిర్వహించాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. 2015 నవంబరు 27న ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ని నిర్వహించారు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో మొత్తం 2,254 మ్యాచ్‌లు జరిగాయి.

అత్యధిక టెస్టులాడిన దేశంగా ఇంగ్లాండ్
మిగతా దేశాలతో పోలిస్తే ఇంగ్లాండ్ అత్యధికంగా 983టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో 351 టెస్టుల్లో విజయాం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా (799), భారత్ (510) ఉన్నాయి. టీమిండియా తన తొలి టెస్టును 1932 జూన్ 25న ఇంగ్లాండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications