Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ ఫొటో.. ధోనీతో పంత్ చిలౌట్.. ఎక్కడో తెలుసా?!!

Rishabh Pant Chills With MS Dhoni At His Home In Ranchi || Oneindia Telugu
Good Vibes Only: Rishabh Pant chills with MS Dhoni at his home in Ranchi

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంజాయ్ చేసాడు. రాంచీలోని ధోనీ నివాసంలో పంత్ చిలౌట్ అయ్యాడు. ఇద్దరి కలిసి గార్దెలో కూర్చుకుని మాట్లాడుకున్నారు. ఈ సమయంలో వారితో ఓ శునకం కూడా ఉంది. దానితో పంత్ ఆడుకున్నాడు. దీనికి సంబందించిన ఫొటోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం పోస్ట్ చేసాడు. 'గుడ్ వైబ్స్ ఓన్లీ' అని రాసుకొచ్చాడు.

ప్రస్తుతం పంత్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఈ ఫొటోని తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాదు తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. కీపింగ్‌లో ధోనీ వద్ద సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. 'శునకంతో ఏం చెబుతున్నావ్ పంత్', 'దిగ్గజంతో ఎంజాయ్ చేస్తున్నావ్', 'సలహాలు బాగా తీసుకో' అని కామెంట్లు చేస్తున్నారు.

గురువారం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమీటి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్‌లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా పంత్ ఎంపిక చేయపడ్డాడు. మరోవైపు దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన సంజు శాంసన్‌ కూడా ఎంపికయ్యాడు. దీంతో పోటీ తీవ్రమైంది. పంత్ నిరూపించుకోకపోతే జట్టులో చోటు కష్టంగా మారనుంది. ఇక టెస్టులో కూడా సాహా పోటీలో ఉన్నాడు.

ఇక ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు కూడా అందుబాటులో లేడు. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు.

తాజాగా రాంచీ వేదికగా మూడో టెస్ట్ జరిగింది. ఎంఎస్‌ ధోనీ స్వస్థలం రాంచీ కాబట్టి.. తొలి రోజే మ్యాచ్‌కు హాజరవుతాడని అందరూ ఊహించారు. కానీ.. మంగళవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మైదానంకు వచ్చాడు. బహుమతి ప్రదానోత్సవం పూర్తయ్యాక ధోనీ టీమిండియా డ్రస్సింగ్‌ రూమ్‌కు చేరుకున్నాడు. అక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, జట్టు సభ్యులతో చాలా సమయం గడిపాడు.

Story first published: Friday, October 25, 2019, 15:28 [IST]
Other articles published on Oct 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+