Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు గుడ్ న్యూస్: వాళ్లు ఫామ్‌లోకి వచ్చేశారు

టీ20 వరల్డ్ కప్‌కు ప్రకటించిన భారత జట్టులోని ఆటగాళ్లంతా స్టార్ ప్లేయర్లే. ఒంటిచేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చగలరు. కానీ బీసీసీఐ టీమిండియాను వెల్లడించిన తర్వాత జట్టు గురించి తీవ్ర చర్చలు కొనసాగాయి. ఫామ్‌లోని ఆటగాళ్లను ఎలా ఎంపిక చేస్తారు? ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను ఎలా విస్మరిస్తారనే ప్రశ్నలు వచ్చాయి.

అంతేగాక గాయాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లకు ఎలా ఛాన్స్ ఇస్తారని వాదనలు వినిపించాయి. కానీ రోజులు గడిచే కొద్దీ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైనదే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఎంపిక సరైనదంటూ నెట్టింట పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి.

Good news for Team India Hardik-Surya are back in form

మరోవైపు సూర్య,హార్దిక్ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. వన్డే వరల్డ్ కప్‌లో గాయపడ్డ హార్దిక్ అయిదు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. సర్జరీ అనంతరం సూర్య కూడా మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఐపీఎల్‌తో వీరిద్దరు పునరాగమనం చేశారు.కానీ రీఎంట్రీలో మొదట ఫ్లాప్ అయ్యారు. హార్దిక్, సూర్య తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి శ్రమించాల్సి వచ్చింది.

కానీ ఈ సీజన్ అర్ధభాగం ముగిసిన తర్వాత హార్దిక్ బంతితో మెరుస్తున్నాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేస్తూ తన కోటాను పూర్తి చేస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల్లో పూర్తి ఓవర్లు వేశాడు. అంతేగాక ఈ మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్ తుదిజట్టులో బ్యాకప్ సీమర్ టీమిండియాకు దొరికేశాడు.

ఇక సోమవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య తన ప్రతాపం చూపించాడు. 51 బంతుల్లో మెరుపు శతకం సాధించాడు. టీ20ల్లో తానెంత ప్రమాదకరమో మరోసారి ప్రపంచానికి గుర్తుచేశాడు. 20 ఓవర్లు ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు తిరిగి ఫామ్‌లోకి రావడంతో టీమిండియా అభిమానులు సంతోషిస్తున్నారు. వాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ భారత్‌కు ప్రపంచకప్ అందించాలని కోరుతున్నారు.

Story first published: Tuesday, May 7, 2024, 15:34 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+