Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భయం లేకుండా ఆడతాడు: ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై యువరాజ్

హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్‌ ధోని తప్పుకుని మంచిపని చేశాడని టీమిండియా ఆల్ రౌండర్ యవరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇక ఇప్పుడు ధోని భయమన్నదే లేకుండా క్రికెట్ ఆడతాడని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలో అతడి స్ధానంలో కోహ్లీకి కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

ధోని వీడ్కోలుపై ఎందుకు ట్వీట్ చేయలేదంటే!: సెహ్వాగ్ ఆన్సర్ అదుర్స్

ఇకపై మూడు ఫార్మెట్లలో టీమిండియాకు కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించనున్నాడు. కాగా ఆటగాడిగా ధోని కొనసాగనున్నాడు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు ప్రకటించిన జట్టులో టీమిండియా ఆల్ రౌండర్ యువీకి సెలక్టర్లు చోటు కల్పించారు.

కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు

కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు

ఈ నేపథ్యంలో బీసీసీఐ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడాడు. కెప్టెన్‌గా ధోని జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని, ఇంకా క్రికెట్‌ ఆడే సత్తా అతడిలో ఉందని, ఆటగాడిగా జట్టుకు ధోని ఎంతో అవసరమని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ధోనికి, తనకు మధ్య ఓ విషయంలో సారూపత్య ఉందని యువీ చెప్పాడు.

తామిద్దరం భయమన్నదే లేకుండా క్రికెట్‌ ఆడుతాం

తామిద్దరం భయమన్నదే లేకుండా క్రికెట్‌ ఆడుతాం

తామిద్దరం భయమన్నదే లేకుండా క్రికెట్‌ ఆడుతామని, త్వరలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌‌లో అదే జోరుని కొనసాగిస్తామని చెప్పాడు. 'కెప్టెన్సీ వైదొలగాలని ధోనీ సరైన నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టుకు ధోని అత్యున్నతమైన కెప్టెన్. అతని సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలను సొంతం చేసుకున్నాం. టెస్టులో నెంబర్‌ ర్యాంక్‌ సాధించాం' అని అన్నాడు.

ఇన్ని విజయాలు సాధించిన భారత కెప్టెన్‌ మరొకరు లేరు

ఇన్ని విజయాలు సాధించిన భారత కెప్టెన్‌ మరొకరు లేరు

ఇన్ని విజయాలు సాధించిన భారత కెప్టెన్‌ మరొకరు లేరు. ధోని ప్రశాంతంగా ఉంటాడు. వచ్చే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని టీమిండియాకు కొత్త కెప్టెన్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన నిర్ణయమని ధోని భావించి ఉంటాడు. అది విరాట్ కోహ్లీయే అని భావించి ఉంటాడు' అని యువీ పేర్కొన్నాడు.

కోహ్లీ జట్టును విజయవంతంగా నడిపించగలడు

కోహ్లీ జట్టును విజయవంతంగా నడిపించగలడు

'కోహ్లీలో ఈ లక్షణాలు ఉన్నాయని ధోని అభిప్రాయపడి ఉంటాడు. కోహ్లీ జట్టును విజయవంతంగా నడిపించగలడని భావిస్తున్నా. కోహ్లీ చిన్న వయసు నుంచి అతన్ని చూస్తున్నా. కెరీర్‌లో నిలకడగా రాణిస్తూ రోజు రోజుకు రాటుదేలుతున్నాడు. సీనియర్‌‌గా ధోని మద్దతు అతనికి ఉంటుంది' అని యువరాజ్ పేర్కొన్నాడు.

ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ధోని

ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ధోని

తన కెరీర్‌లో మొత్తం 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన ధోని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం. వన్డే ప్రపంచ కప్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాదు భారత్ తరుపున ఆరు వరల్డ్ టీ20 టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్‌గా ధోని ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+