న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెట్ అంత బోరింగ్ గేమ్ మరొకటి లేదు'

Golf, cricket and American football are Britain's most boring sports... and only 43 per cent find football exciting

హైదరాబాద్: భారతదేశంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌లతో పాటు ఇంకా చాలా దేశాల్లో ఈ క్రీడకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అలాంటిది (పోలింగ్ కంపెనీ యూగోవ్) అనే కంపెనీ చేసిన సర్వేలో క్రికెట్‌ బోరింగ్‌ గేమ్‌ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఓ అంతర్జాతీయ ఇంటర్నెట్‌ బేస్‌డ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ అండ్‌ అనలిస్టిక్స్‌ సంస్థ చేపట్టిన తాజా అధ్యయంలో గోల్ఫ్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌, క్రికెట్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

యువ్‌జీవోవీ అనే అధ్యయన సంస్థ తాజాగా ట్విటర్‌ ద్వారా 'ఏ క్రీడను చూసినప్పుడు బోర్‌గా ఫీలవుతారు'అన్న దానిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే గణాంకాలను పలువుర్ని ఆశ్చర్యపరిచాయి. అమెరికాలో ఫుట్‌బాల్‌కు, భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ తక్కువేం కాదు. కానీ, ఈ సర్వేలో 70 శాతం ఓట్లతో గోల్ఫ్‌ మొదటి స్థానంలో నిలవగా అమెరికన్‌ ఫుట్‌బాల్‌(59), క్రికెట్‌(59) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

క్రికెట్‌ చూసే సమయంలో ఒక్కోసారి బోరింగ్‌గా ఫీలవుతాం లేదంటే ఒక్కోసారి ఆసక్తిగా ఎదురుచూస్తాం అన్న ఆప్షన్‌కు 17 శాతం ఓట్లు పడగా.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాం అన్న దానికి 22 శాతం ఓట్లు దక్కాయి. అథ్లెటిక్స్‌, టెన్నిస్‌, జిమ్నాస్టిక్స్‌ చూసేందుకు ఎక్కువమంది ఇష్టపడతారని ఈ అధ్యయనంలో తేలింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 12, 2018, 10:14 [IST]
Other articles published on Jan 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X