అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు శుభారంభం దక్కలేదు. తొలి బంతికే వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ వేసిన చక్కని బంతికి టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతి 3.3 డిగ్రీలు స్వింగ్ అయ్యింది. ఈ క్రమంలో బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించిన జైస్వాల్‌కు నిరాశే మిగిలింది.
బ్యాటుకు కనెక్ట్ కాకపోవడంతో ప్యాడ్లకు తాకింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఔట్ అంటూ అపీల్ చేయగా.. అంపైర్ వేలు పైకెత్తాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి జైస్వాల్ రివ్యూకి వెళ్లాలా వద్దా అనే సలహా కోరాడు. సమీక్షలో లాభం ఉండదని రాహుల్ చెప్పడంతో జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయింది. అయితే మిచెల్ స్టార్క్ చాలా ఆవేశంగా సంబరాలు చేసుకున్నాడు. ఇటీవల కాలంలో స్టార్క్ దూకుడుగా సెలబ్రేషన్స్ చేయడం ఇదే.

తొలి టెస్టులో మిచెల్ స్టార్క్ X యశస్వీ జైస్వాల్ మధ్య జరిగిన ఫైట్ దీనికి కారణం. హర్షిత్ రాణాను స్టార్క్ కవ్వించగా.. దానికి బదులుగా స్టార్క్‌ను జైస్వాల్ స్లెడ్జ్ చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీలు బాది... చాలా స్లోగా బౌలింగ్ వేస్తున్నావని స్టార్క్‌తో జైస్వాల్ అన్న మాటలు వైరల్‌గా మారాయి. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు స్టార్క్ అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేశాడు.
భారత్: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, మహహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మెక్‌స్వీనే, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బొలాండ్.
FIRST BALL OF THE TEST!
— cricket.com.au (@cricketcomau) December 6, 2024
Mitchell Starc sends Adelaide into delirium.#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/pIPwqlX3dJ