న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచులో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఓ రికార్డును తిరగరాశాడు. టీమిండియా రెండో ఇన్నింగ్సులో భాగంగా శనివారం మూడో స్థానంలో బ్యాటింగుకు దిగిన రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు.
దాంతో పాటే తొలి బంతికే వెనుదిరిగి గొల్డెన్ డక్‌ను తన పేరిట నమోదు చేసుకున్నాడు. 16 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాదీ వివిఎస్ లక్ష్మణ్ ఇదే తరహాలో అవుటయ్యాడు. 1999లో గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో రిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో లక్ష్మణ్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు.

అప్పుడు లక్ష్మణ్ మూడో స్థానంలో వచ్చి గోల్డెన్ డకౌట్ కాగా, ఆ తర్వాత 16 ఏళ్లకు టిమీడియా తరఫున అదే స్థానంలో బ్యాటింగుకు దిగిన రోహిత్ శర్మ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టుల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-1 స్కోరుతో గెలుచుకుంది. భారత్ దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.