
గోడాడీతో ఐసీసీ ఒప్పందం
ఈ ఒప్పందంపై గోడాడీ ఇండియా విభాగం ఎండీ, ఉపాధ్యక్షుడు నిఖిల్ అరోరా మాట్లాడుతూ "వరల్డ్‌కప్ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచలోని దాదాపు మూడింట రెండోంతుల మంది ఈ మెగా ఈవెంట్‌ని వీక్షిస్తారు. ముఖ్యంగా భారతీయులు దీనిని కచ్చితంగా చూస్తారు. మేము ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం" అని అన్నారు.

ఆన్లైన్ ప్రయోజనాలను ప్రచారం చేస్తాం
"గత కొంతకాలంగా భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ వరల్డ్‌కప్‌ను వేదికగా చేసుకొని ఆన్లైన్ ప్రయోజనాలను ప్రచారం చేస్తాం" అని అన్నారు. ఇక ఐసీసీ బిజినెస్ విభాగం జనరల్ మేనేజర్ క్యాంప్‌బెల్ జామ్సన్ మాట్లాడుతూ "మేం 2019 వరల్డ్‌కప్ కోసం గోడాడీతో ఒప్పందం కుదుర్చుకున్నాం" అని చెప్పారు.

భారత్‌లో క్రీడలను ప్రోత్సహించడంలో
"ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో క్రీడలను ప్రోత్సహించడంలో గోడాడీ చురుగ్గా ఉంది. మాతో భాగస్వామ్యంతో ఆ సంస్థ వ్యాపార లక్ష్యాలు నెరవేరతాయి. ఈ ఒప్పంద ఇరు వర్గాలకు లాభంగా ఉంటుంది" అని అన్నారు. గోడాడీతో పాటు ఐసీసీ ఇప్పటికే బి9 బేవరేజస్, నిస్సాన్ మోటార్, ఒప్పో, ఎంఆర్ఎఫ్,ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందాలు చేసుకొంది.

మే 30 నుంచి జూన్ 14 వరకు
ఇదిలా ఉంటే, షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.