పప్పా.. కమాన్ పప్పా: ధోనిని ప్రోత్సహించిన జీవా (వీడియో)


హైదరాబాద్: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని కుమార్తె జీవా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్యాలరీలో ఉన్న జీవా 'పప్పా.. కమాన్ పప్పా' అని బిగ్గరగా అరుస్తూ తండ్రిని ప్రోత్సహించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ధోని (35 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జాదవ్ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టుని గెలిపించాడు.
చెన్నైకి వరుసగా రెండో విజయం
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా ఇది రెండో విజయం కావడం విశేషం. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదనలో షేన్ వాట్సన్ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు), మహేంద్రసింగ్ ధోని (32 నాటౌట్: 35 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో.. మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ 150/4తో విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్ పృథ్వీ షా(24; 16 బంతుల్లో 5 ఫోర్లు) జట్టు స్కోరు 36 వద్ద ఔటవ్వగా... శిఖర్ ధావన్(51: 47 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన శ్రేయస్ అయ్యర్ (18; 20 బంతుల్లో 1 సిక్స్)తో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు.
వరుసగా వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
కీలక సమయంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఇమ్రాన్ తాహిర్ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రిషబ్ పంత్(25;13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బ్రావో వేసిన భారీ షాట్ ఆడి.. బౌండరీ లైన్ వద్ద శార్దుల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో 15.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ దూకుడుగా ఆడే క్రమంలో డ్వేన్ బ్రావో వేసిన 18వ ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాడు.
ధావన్ హాఫ్ సెంచరీ
ధావన్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ భారీ షాట్లు కొట్టడంలో తడబడ్డాడు. దీంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. చివర్లో రాహుల్ తెవాతియా(11 నాటౌట్), అక్షర్ పటేల్(9 నాటౌట్)లు తలో బౌండరీ సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రేవో మూడు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహీర్‌లకు తలో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications